Smriti Irani : ఎంపీ అధీర్ రంజ‌న్ చౌద‌రి క్ష‌మాప‌ణ చెప్పాలి

బీజేపీ ఎంపీల ప్ర‌ధాన డిమాండ్..నిర‌స‌న‌

Smriti Irani : కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై చేసిన కామెంట్స్ ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. రాష్ట్ర‌ప‌తి పేరును కావాల‌ని రాష్ట్ర‌ప‌త్ని అని ఎంపీ పేర్కొనడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

ఒక ఆదివాసీ తెగ‌కు చెందిన వ్య‌క్తి అత్యున్న‌త స్థానంలో ఉంటే త‌ట్టుకోలేక వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారంటూ మండిప‌డింది. ఇది పూర్తిగా మ‌హిళ‌ల‌ను కించ ప‌ర్చ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొంది.

గురువారం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో బీజేపీకి చెందిన మ‌హిళా ఎంపీలు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఎంపీతో పాటు కాంగ్రెస్ పార్టీ బేష‌ర‌త్తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఒక మ‌హిళ ప‌ట్ల ఇలాంటి చౌక‌బారు విమ‌ర్శ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. ఒక గౌర‌వ ప్ర‌ద‌మైన మ‌హిళ ప‌ట్ల గౌర‌వ స్థానంలో ఉన్న ఎంపీ ఇలాంటి దిగ‌జారుడు కామెంట్స్ చేయడం ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని సూచిస్తుంద‌ని పేర్కొన్నారు నిర్మ‌లా సీతారామ‌న్.

ఒక మ‌హిళ ప‌ట్ల బాధ్య‌త లేకుండా మాట్లాడిన ఎంపీపై త‌గిన రీతిలో చ‌ర్య తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి స్మ‌తీ ఇరానీ(Smriti Irani) .

ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రికి, కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. తాము క్ష‌మాప‌ణ‌లు చెప్పేంత దాకా ఊరుకో బోమంటూ హెచ్చ‌రించారు.

బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన నాటి నుంచీ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందంటూ మండిప‌డ్డారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని, ఇలాంటి కామెంట్స్ మున్ముందు మాట్లాడ కూడ‌ద‌ని డిమాండ్ చేశారు.

Also Read : మూడో రోజుకి చేరిన 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం

Leave A Reply

Your Email Id will not be published!