Adhir Ranjan Chowdhury : నాకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వండి
లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన ఎంపీ
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో లోక్ సభ సాక్షిగా చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లాకు విన్నవించారు.
ఈ మేరకు సుదీర్ఘ లేఖ కూడా రాశాడు. తాను చేసిన ఆరోపణలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు కాంగ్రెస్ ఎంపీ. గురువారం ఉభయ సభలలో ఎంపీ కామెంట్స్ పై కలకలం రేగింది.
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ. మంత్రుల సారథ్యంలో మహిళా బీజేపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళన చేపట్టారు. వెంటనే బాధ్యత వహిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury)పై నిప్పులు చెరుగుతున్నారు బీజేపీ శ్రేణులు.
ఈ సందర్భంగా ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ బాధ్యత వహిస్తూ సారీ చెప్పాలన్నారు నిర్మలా సీతారామన్. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి.
తనకు మహిళల పట్ల గౌరవం ఉందని, తాను ఎప్పుడూ వారి పట్ల అనుచితంగా మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల తాను కావాలని కామెంట్ చేయలేదని స్పష్టం చేశారు అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury).
Leader of Congress Party in Lok Sabha Adhir Ranjan Chowdhary has requested Lok Sabha Speaker to give him a chance to speak on the floor of the house on the allegations made against him for his statement, he has given a letter on this as well.
(File Pic) pic.twitter.com/0ISb72u1Fi— ANI (@ANI) July 28, 2022