Partha Chatterjee : పార్థ ఛటర్జీపై చర్యకు టీఎంసీ సిద్ధం
సమావేశమైన పార్టీ క్రమశిక్షణ కమిటీ
Partha Chatterjee : పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న స్కాంలో అరెస్ట్ అయిన వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి పార్థ ఛటర్జీ పై వేటు వేసేందుకు రంగం సిద్దమయ్యిందా. అవుననే అనిపిస్తోంది.
ఇప్పటికే ఆయనపై చర్య తీసుకోక పోతే అవినీతి, అక్రమాలకు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుందని, ఇదే గనుక ప్రజలలోకి వెళితే పార్టీకి కోలుకోలేని డ్యామేజ్ ఏర్పడే ప్రమాదం ఉందని ఆలోచిస్తోంది.
నిన్నటి దాకా టీఎంసీ తమపై కేంద్రం కక్ష గట్టిందని ఆరోపిస్తూ వచ్చింది. కానీ మంత్రికి సహచరురాలిగా పేరొందిన ప్రముఖ నటి అర్షితా ముఖర్జీకి సంబంధించిన ఇళ్లల్లో దాడులు చేపట్టింది ఈడీ.
ఈ సోదాల్లో ఏకంగా కోట్లాది రూపాయలు పట్టుబడ్డాయి. మొదటి సారి దాడుల్లో రూ. 21 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. 20 ఖరీదైన మొబైళ్లు దొరికాయి.
ఇక జూలై 27న రాత్రి జరిపిన విస్తృత దాడుల్లో రూ. 29 కోట్ల నగదుతో పాటు 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో పట్టుబడిన అత్యధిక ధనం, బంగారం కావడం విశేషం.
దీంతో రంగంలోకి దిగారు టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ. తాను ఒక్క పైసా జీతం తీసుకోవడం లేదని, తప్పు చేసిన వారిని తాను సపోర్ట్ చేయనని చెప్పారు.
ఈడీ విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగు చూశాయి. ఆ డబ్బంతా మంత్రి పార్థ ఛటర్జీదేనంటూ(Partha Chatterjee) అర్షిత ముఖర్జీ వెల్లడించింది. చివరకు అతడిపై చర్యలు తీసుకుంటేనే పార్టీకి బెటర్ అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
తాజాగా టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పార్టీ క్రమశిక్షణా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Also Read : కామెంట్స్ కలకలం బీజేపీ ఆగ్రహం