PM Modi : దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పాడి ప‌రిశ్ర‌మ కీల‌కం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

PM Modi : దేశ ఆర్థిక వ్య‌వ‌స్థకు పాడి ప‌రిశ్ర‌మ దోహ‌ద‌కారిగా ఉంద‌న్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ లో ఇది అత్యంత కీల‌క పాత్ర పోషిస్తోంద‌న్నారు.

ఇవాళ గుజ‌రాత్ డెయిరీ మార్కెట్ విలువ ల‌క్ష కోట్లు అని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం అంకిత భావంతో ప‌ని చేస్తుంద‌ని చెప్పారు.

ప్ర‌తి ఒక్క‌రు గ్రామీణ ప్రాంతాల‌లో పాడిని పెంచేందుకు కృషి చేయాల‌న్నారు. స‌బ‌ర్ డెయిరీలో సాంకేతిక‌త‌తో న‌డిచే ప్రాజెక్టుల‌ను గురువారం ప్రారంభించారు మోదీ. దీని ద్వారా ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకుంటోంద‌న్నారు.

పాల ఉత్ప‌త్తిదారులు ప‌ర‌క్షోంగా, ప్ర‌త్య‌క్షంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లుగుతార‌ని చెప్పారు. గుజ‌రాత్ లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు మోదీ(PM Modi).

ఇవాళ స‌బ‌ర్ డెయిరీ విస్త‌రించింది. ఇక్క‌డ వంద‌ల కోట్ల‌తో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయి. ఆధునిక సాంకేతిత‌తో కూడిన మిల్క్ పౌడ‌ర్ ప్లాంట్ , ఎ – సెప్టిక్ ప్యాకింగ్ విభాగంలో మ‌రో లైన్ తో స‌బర్ డెయిరీ సామ‌ర్థ్యం మ‌రింత పెరుగుతుంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

దేశంలో మ‌హిళ‌ల సార‌థ్యంలోని అభివృద్దికి డెయిరీ కూడా దోహ‌దకారిగా ఉంద‌న్నారు. మ‌హిళ‌లు ఈ రంగంలో కీల‌కంగా మారార‌ని వారి కృషి గొప్ప‌ద‌న్నారు.

10,000 రైతు ఉత్ప‌త్తిదారుల సంఘాల ఏర్పాటుకు సంబంధించిన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు మోదీ(PM Modi). ఈ సంఘాల ద్వారా చిన్న రైతులు నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ , వాల్యూ లింక్డ్ ( విలువ ఆధారిత ) ఎగుమ‌తి , స‌ర‌ఫ‌రాతో అనుసంధానం చేయ‌బ‌డ‌తార‌ని చెప్పారు ప్ర‌ధాని.

దీని వ‌ల్ల గుజ‌రాత్ రైతుల‌కు మ‌రింత ప్ర‌యోజనం క‌లుగుతుంద‌న్నారు.

Also Read : ప్ర‌తి దానికి ప‌రిమితి ఉంటుంది

Leave A Reply

Your Email Id will not be published!