Renuka Chowdhury : సోనియా గాంధీ ఉక్కు మహిళ – రేణుకా
రాజకీయాల్లోకి లాగకండి అంటూ సూచన
Renuka Chowdhury : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని టార్గెట్ గా చేస్తూ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ మూకుమ్మడి దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
గురువారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఈ దేశంలో ఎవరు ఏమిటనేది ప్రజలకు తెలుసన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్లు లాల్ క్రిష్ణ అద్వానీ, దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి మహా మహులు సైతం సోనియా గాంధీ వ్యక్తిత్వానికి గౌరవం ఇస్తూ వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు రేణుకా చౌదరి(Renuka Chowdhury).
ఇప్పటికే పార్లమెంట్ ను స్తంభింప చేశారని, లేని దాని కోసం పనిగట్టుకుని రాజకీయం చేయడం బీజేపీ సర్కార్ కు, ఆ పార్టీ శ్రేణులకు ఒక అలవాటుగా మారిందన్నారు.
ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదని పేర్కొన్నారు ఆమె. ఇప్పటికే తనకు హిందీ రాదని, ఒకవేళ మాట దొర్లి ఉండి ఉంటే , మనసు నొప్పిస్తే దేశ రాష్ట్రపతిగా కొలువు తీరిన ద్రౌపది ముర్ముకు క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారని తెలిపారు.
ఇందులో ఎలాంటి తప్పు లేని, జోక్యం లేని మేడం సోనియా గాంధీని ఎలా లాగుతారంటూ ప్రశ్నించారు రేణుకా చౌదరి. బీజేపీ తన గత చరిత్రను ఒకసారి చూసుకోవాలని సూచించారు.
ఆరోపణలు చేసినంత మాత్రాన అబద్దాలు వాస్తవాలు కావన్న సంగతి కేంద్ర మంత్రులు తెలుసుకుంటే మంచిదని పేర్కొన్నారు.
Also Read : మోదీ సర్కార్ ప్రచారానికి రూ. 3,339 కోట్లు
Madam Gandhi is a tough woman and brought the likes of Advani, Vajpayee & co. down to their knees.
It's better if BJP remembers history. Because it will repeat again. #स्मृति_ईरानी_शर्म_करो
— Renuka Chowdhury (@RenukaCCongress) July 28, 2022