Anurag Thakur : మోదీ స‌ర్కార్ ప్ర‌చారానికి రూ. 3,339 కోట్లు

ఈ డ‌బ్బుల‌తో స్కూళ్లు, ఆస్ప‌త్రులు క‌ట్టొచ్చు

Anurag Thakur : ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 3 వేల కోట్ల‌కు పైగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ఖ‌ర్చు చేసింది ప్ర‌జ‌ల కోసం అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే.

కానే కాదు తాము చేసిన కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల‌కు ఎలా ల‌బ్ది చేకూర్చామ‌నే దానిపై ఊద‌ర‌గొట్టే ప్ర‌క‌ట‌న‌ల కోసం ఈ కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.

అదేదో కంట్రోల‌ర్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్) చెప్ప‌లేదు. సాక్షాత్తు కేంద్ర కేబినెట్ లో ఉన్న కేంద్ర స‌మాచార, ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

లోక్ స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తోంది ప్ర‌చారం కోస‌మ‌ని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు.

ఈ మొత్తం డ‌బ్బుల్ని ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌తో పాటు సోష‌ల్ మీడియా (డిజిట‌ల్ ) మీడియా కోసం ఖ‌ర్చు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. కేంద్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసిన రూ. 3,339 కోట్ల‌తో దేశంలో కొన్ని గ్రామాలు బాగు ప‌డ‌తాయి.

వృద్దుల కోసం అనాధ శ‌ర‌ణాల‌యాలు ఏర్పాటు చేయొచ్చు. ఒక రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల‌ను బాగు చేయొచ్చు. పోనీ ఈ డ‌బ్బుల‌న్నీ భార‌తీయ

జ‌న‌తా పార్టీవి కావు, దాని స‌ర్కార్ లో భాగ‌మైన పార్టీల‌వి కావు.

పోనీ మోదీ ఆయ‌న కేబినెట్ స్వంత డ‌బ్బులు కావు. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి ప‌న్నులు క‌డితే వ‌చ్చిన డ‌బ్బులు అవి. ఈ మొత్తం డ‌బ్బుల్ని 2017 -18 నుంచి ఈ ఏడాది 2022 జూలై 12వ తేదీ దాకా ఐదేళ్ల‌లో మీడియాలో ప్ర‌క‌ట‌నల కోసం రూ. 3,339. 49 కోట్లు ఖ‌ర్చు చేసింది.

ప్రింట్ మీడియాలో ప్ర‌క‌ట‌నల కోసం రూ. 1,756.48 కోట్లు, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల కోసం రూ. 1,583.01 కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).

Also Read : ‘జ్యోతి’ అందుకున్న పీఎం..సీఎం

Leave A Reply

Your Email Id will not be published!