Suspended MP’s : ఎంపీల ఆందోళన కొనసాగుతున్న నిరసన
27 మంది ఎంపీలపై లోక్ సభ..రాజ్యసభ వేటు
Suspended MP’s : పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఎంపీలపై వేటు వేయడం మామూలుగా మారింది. లోక్ సభలో నలుగురిని స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.
ఇక రాజ్య సభలో అత్యధికంగా 23 మంది ఎంపీలకు షాక్ ఇచ్చారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. తమపై సస్పెన్షన్ వేటు(Suspended MP’s) వేయడాన్ని నిరసిస్తూ ఎంపీలంతా మూకుమ్మడిగా పార్లమెంట్ ఆవరణలో 50 గంటల పాటు నిరసన చేపట్టారు.
అక్కడే టెంట్ వేసుకుని ఉన్నారు. టెంట్ లు తమ కోసం ఏర్పాటు చేయాలని కోరారు. కానీ పోలీసులు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. అయితే పార్లమెంట్ ఆవరణలోని లైబ్రరీ లో ఉన్న టాయి లెట్స్ ను వాడుకోవచ్చని సూచించింది.
ఇందుకు సంబంధించి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పై ఆఖరున వేటు వేసింది.
ఉత్తర ప్రదేశ్ లో కల్తీ మద్యం కారణంగా ఇప్పటి వరకు 50 మంది చని పోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
దీనిని నిరసిస్తూ సంజయ్ సింగ్ కాగితాలు చించి బళ్లపై వేశారు. ఆపై పోడియం వద్దకు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో అతడిపై వేటు వేశారు.
కాగా సస్పెండ్ కు గురైన వారిలో కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఆప్ ఎంపీలు ఉన్నారు. వీరంతా మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కావాలని ప్రశ్నించకుండా చేసేందుకే కక్షగట్టి వేటు వేశారంటూ ఆరోపించారు.
Also Read : అధిర్ రంజన్ కు మహిళా కమిషన్ నోటీసులు