Al Qaeda Linked Busted : అస్సాంలో ఉగ్రవాదుల పట్టివేత
పట్టుబడిన వారిలో మదర్సా టీచర్
Al Qaeda Linked Busted : అస్సాంలో అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠాను ఛేదించారు. భారత ఉప ఖండం లోని అల్ ఖైదాతో సహా గ్లోబల్ టెర్రర్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 11 మందిని అదుపు లోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్ కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉంది. ఇక అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు రాష్ట్రంలోని మదర్సా టీచర్ కూడా ఉండడం విశేషం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాం లోని మోరిగావ్ , బార్పేట, గౌహతి , గోల్ పరా జిల్లాల నుండి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామిక్ ఛాందసవాదానికి వీరు ప్రభావితం అయ్యారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సీరియస్ గా స్పందించారు. మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు.
ఇంకా అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేస్తామన్నారు. జిహాదీ గ్రూప్ తో, ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
జాతీయ పోలీస్ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకుని దాడులు చేపట్టారని సీఎం తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముస్తఫా అలియాస్ ముఫ్తీ ముస్తాఫా మోరిగావ్ జిల్లాలోని సహారియా గావ్ నివాసి.
భారత దేశంలోని అల్ ఖైదాతో(Al Qaeda Linked Busted) సంబంధం ఉన్న అన్సరుల్లా బంగ్లా టీమ్ క్రియాశీల సభ్యుడు. ముస్తఫా సహారియా గావ్ గ్రామంలో మదర్సా (జామియుల్ హుదా మదర్సా ) నడుపుతున్నాడని , దానిని సీలు చేసినట్లు వెల్లడించారు.
ముస్తాఫాతో పాటు భుయాన్ , అబ్బాస్ అలీ , మెహబూబ్ , జుబైర్ ఖాన్ , రఫీకుల్ ఇస్లాం, హమీదుల్ ఇస్లాం, మొయినుల్ హక్, కాజీబుర్ హుస్సేన్ , ముజిబౌర్ రెహమాన్ , షాహనూర్ ఇస్లాం లను అరెస్ట్ చేశారు.
Also Read : పాక్ లో పోలీస్ బాస్ గా హిందూ మహిళ