TTD EO Dharma Reddy : ఉత్సవాలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
TTD EO Dharma Reddy : ప్రత్యేక దర్శనాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా నిలిపి వేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఉత్సవాలలో సామాన్య భక్తులకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు.
అన్ని రకాల ప్రత్యేక దర్శనాలకు నో చాన్స్ అన్నారు. రూ. 300 దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి ట్రస్టు దాలు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు, వీఐపీ బ్రేక్ , వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల పేరెంట్స్ కు సంబంధించి ప్రత్యేక దర్శనం, ఇతర దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు ఈవో ధర్మారెడ్డి. కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు.
తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష చేపట్టారు ఈవో(TTD EO Dharma Reddy). బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ లో ప్రారంభం అవుతాయని వెల్లడించారు. 27న సీఎం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ ప్రారంభం అవుతుందన్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల దాకా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తామని వెల్లడించారు.
భక్తులకు సేవలు అందించేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామని చెప్పారు ఈవో ధర్మారెడ్డి. ఇదే సమయంలో గరుడ సేవ రోజు 28 మధ్యాహ్నం 12 గంటల దాకా తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాక పోకలను నిషేధించినట్లు తెలిపారు.
Also Read :‘జ్యోతి’ అందుకున్న పీఎం..సీఎం