CM Yogi Adityanath : భారత దేశానికి అధీర్ క్షమాపణ చెప్పాలి
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యా నాథ్
CM Yogi Adityanath : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని కామెంట్స్ చేశారంటూ కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరిపై బీజేపీ మండి పడింది. కేంద్ర మంత్రులతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుతున్నారు.
అధీర్ రంజన్ చౌదరి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని కోరుతున్నారు. తాజాగా జాతీయ మీడియా ఎన్ఐతో మాట్లాడారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) . ఆయన ఎంపీ పై మండిపడ్డారు.
ఆదివాసీ తెగకు చెందిన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైతే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక పోతోందంటూ ఫైర్ అయ్యారు. వెంటనే ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ద్రౌపది ముర్ముతో పాటు భారత దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఎంపీ తరపున క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టారు కాంగ్రెస్ ఎంపీలు.
అయితే తనకు హిందీ భాష రాదని. ఇంగ్లీష్ లో తాను ఎక్స్ పర్ట్ అని చెప్పారు అధీర్ రంజన్ చౌదరి. కానీ తాను బెంగాలీనని హిందీని వాడడం రాదని, అందులో తప్పు దొర్లి ఉంటే తాను క్షమాపణ చెప్పేందుకు సిద్దమేనని ప్రకటించారు ఎంపీ.
తాను ద్రౌపది ముర్ముకు మాత్రమే క్షమాపణ చెబుతానని బీజేపీ మంత్రులు, ఎంపీలకు కాదన్నారు. ప్రస్తుతం అధీర్ రంజన్ చౌదరి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read : బీజేపీ కామెంట్స్ ‘మహూవా’ సీరియస్