Mangaluru CP : మంగ‌ళూరులో రెడ్ అల‌ర్ట్ – సీపీ శ‌శి కుమార్

వ‌రుస‌గా రెండో హ‌త్య‌తో క‌ల‌క‌లం

Mangaluru CP : క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు తీవ్ర క‌ల‌క‌లానికి దారి తీస్తున్నాయి. ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కార్య‌క‌ర్త ప్ర‌వీణ్ నెట్టారు దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

అనంత‌రం ముస్లిం వ‌ర్గానికి చెందిన ఫాజిల్ ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చంపేశారు. దీంతో రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు ఇరు మ‌తాల‌కు చెందిన వారు దారుణ హ‌త్య‌కు గురి కావ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

దీంతో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 10 గంట‌ల త‌ర్వాత ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు మంగ‌ళూరు పోలీస్ క‌మిష‌న‌ర్ ఎన్. శ‌శి కుమార్.

దీంతో ఎలాంటి స‌భ‌లు, స‌మావేశాలు, మూకుమ్మ‌డిగా ఉండ‌డాన్ని నిషేధించిన‌ట్లు చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న జాతీయ మీడియా ఎఎన్ఐతో మాట్లాడారు.

శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు ఈ నిషేధాజ్ఞ‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉడిపిలో మ‌రిన్ని హ‌త్య‌లు, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయ‌నే అనుమానంతో మ‌రింత భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్లు చెప్పారు పోలీస్ క‌మిష‌న‌ర్(Mangaluru CP).

మ‌ద్యం దుకాణాల‌ను మూసి వేయాల‌ని ఆదేశించామ‌న్నారు. కేర‌ళ స‌ర‌హిద్దుతో స‌హా దాదాపు 24 చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

క‌ర్ఫ్యూ విధించామ‌ని , ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు న‌గ‌ర వాసుల‌కు. గురువారం రాత్రి 23 ఏళ్ల మ‌హ‌మ్మ‌ద్ ఫాజిల్ పై న‌లుగురు ఐదుగురు దారుణంగా మార‌ణాయుధాల‌తో దాడి చేశార‌ని తెలిపారు.

బీజేపీ కార్య‌క‌ర్త ప్ర‌వీణ్ హ‌త్య కు ప్ర‌తీకారంగా జ‌రిగిందా అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read : అస్సాంలో ఉగ్ర‌వాదుల ప‌ట్టివేత

Leave A Reply

Your Email Id will not be published!