Rahul Gandhi : డ్ర‌గ్స్..మ‌ద్యానికి అడ్డాగా మారిన గుజ‌రాత్

మ‌ర‌ణాల‌పై రాహుల్ గాంధీ నిల‌దీత

Rahul Gandhi : గుజ‌రాత్ లో చోటు చేసుకున్న శాంతి భ‌ద్ర‌త‌ల గురించి లేవ‌నెత్తారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. అక్ర‌మ మ‌ద్యం ఏరులై పారుతోందని, వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ విచ్చ‌ల విడిగా అమ్ముతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 30 మందికి పైగా మ‌ర‌ణించార‌ని కేవలం విష పూరిత‌మైన మ‌ద్యాన్ని తాగ‌డం వ‌ల్ల అని పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్వంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ లో ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ పాలిస్తోంది.

ఇంత జ‌రుగుతున్నా ఎందుకు నోరు విప్ప‌డం లేదంటూ నిల‌దీశారు. మ‌ద్యం, డ్ర‌గ్స్ వ‌ల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయి.

నిత్యం ప్ర‌చారంలో బిజీగా ఉండే పీఎం మోదీ, సీఎం ఏం ప‌ని చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. క‌నీసం ఆ రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం ఏమైనా చేశారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

నిత్యం వేల కోట్ల విలువ చేసే డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డుతున్నాయి. ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే అంశం. మ‌హాత్మా గాంధీ, స‌ర్దార్ వ‌ల్ల భాయ్ ప‌టేల్ లు పుట్టిన ఈ దేశంలో ఇంత అక్ర‌మ వ్యాపారం చేస్తున్న వారు ఎవ‌ర‌ని అన్నారు.

ఈ మాఫియాను న‌డిపిస్తున్న వారికి అండ‌గా ఉన్న వారు ఎవ‌రో తెలియ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ లోని బొటాడా జిల్లా ధంధుకా తాలూకాలో జ‌రిగిన హూచ్ దుర్గ‌ట‌న‌లో 36 మంది మ‌ర‌ణించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

Also Read : మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!