Delhi High Court Directs : స్మృతీ ఇరానీపై ట్వీట్లు తొల‌గించండి

కాంగ్రెస్ నేత‌ల‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

Delhi High Court Directs : త‌న కూతురుపై లేని పోని ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఇందులో ఎలాంటి అవాస్తవం లేదంటూ స్ప‌ష్టం చేసింది కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వాలు లేవ‌న్నారు.

త‌న‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేందుకే ఇలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారంటూ ఆరోపించారు. ఆపై ఇటీవ‌ల మీడియా స‌మావేశంలో స్మృతీ ఇరానీ కంట‌త‌డి పెట్టారు.

ఆపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ, త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా మాట్లాడుతూ వ‌చ్చిన కాంగ్రెస్ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు.

ఆపై త‌న కూతురుకు గోవాలో రెస్టారెంట్, బార్ న‌డుపుతున్న‌ట్లు ఆధారాలు చూపించాల‌ని లేక పోతే తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించారు.

అంతే కాకుండా స్మృతీ ఇరానీ కోర్టును ఆశ్ర‌యించారు. ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీంతో ఆమె పిటిష‌న్ ను స్వీక‌రించిన హైకోర్టు(Delhi High Court Directs) కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

స్మృతీ ఇరానీపై చేసిన ట్వీట్ల‌ను తొల‌గించాలంటూ జైరాం ర‌మేష్ , ప‌వ‌న్ ఖేరా, నెట్టా డిసౌజాల‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు.

ఇరానీ కూతురు గోవాలో అక్ర‌మంగా బార్ న‌డుపుతోందంటూ ఆరోపిస్తూ చేసిన ట్వీట్లు, వీడియోలు , రీట్వీట్ల‌ను 24 గంట‌లు లోగా తొల‌గించాల‌ని ఆదేశించింది.

ఆగ‌స్టు 18న కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. వాస్త‌వాల‌ను ధ్ర‌వీక‌రించ‌కుండా దూష‌ణాత్మ‌క ఆరోప‌ణ‌లు చేశారంటూ ప్రాథ‌మికంగా భావిస్తున్న‌ట్లు జ‌స్టిస్ మినీ పుష్క‌ర్ణ స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా జై రాం ర‌మేష్ ట్వీట్ చేస్తూ తాము వాస్త‌వాల‌ను స‌మ‌ర్పించేందుకు రెడీగా ఉన్నామ‌ని పేర్కొన్నారు.

Also Read : రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన స్మృతీ ఇరానీ

Leave A Reply

Your Email Id will not be published!