PM Modi : నియంత్రించాల‌నే భావ‌న‌ను తుడిచేశాం

న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఉన్నంత మాత్రాన అన్నింటిని నియంత్రించ‌ద‌ని పేర్కొన్నారు. అన్నా యూనివ‌ర్శిటీ 42వ స్నాత‌కోత్స‌వంలో మోదీ మాట్లాడారు.

ఆయ‌న కొత్త విద్యా విధానాన్ని స‌మ‌ర్థించారు. అయితే త‌మిళ‌నాడులో కొలువు తీరిన డీఎంకే స‌ర్కార్ ఈ అంశాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించింది.

ప్ర‌తి ఒక్క‌రినీ నియంత్రించాల‌నే భావ‌న‌ను త‌మ ప్ర‌భుత్వం మార్చేసింద‌న్నారు ప్ర‌ధాని. కొత్త విద్యా విధానం యువ‌త‌కు నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఎక్కువ స్వేచ్ఛ‌ను ఇస్తుంద‌ని చెప్పారు మోదీ(PM Modi) .

గ‌తంలో అన్నింటి మీద కేంద్ర స‌ర్కార్ పెత్త‌నం ఉండేద‌న్నారు. కానీ దానిని తాము తీసి వేయ‌గ‌లిగామ‌ని తెలిపారు. ప్ర‌తి డొమైన్ కు వెళ్లాల‌ని అనుకోవడం లేద‌న్నారు.

ఇది త‌మ‌ను తాము ప‌రిమితం చేసుకుంటుంద‌న్నారు. కొత్త జాతీయ విద్యా విధానం యువ‌త‌కు ప‌రిణామం చెందుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకునేలా చాన్స్ ఇస్తుంద‌న్నారు న‌రేంద్ర మోదీ(PM Modi) .

ఎన్ఈపీ కింద మూడు భాష‌ల సూత్రాన్ని అనుస‌రించేందుకు డీఎంకే ప్ర‌భుత్వం నిరాక‌రించింది. 1960ల నుండి అమ‌లులో ఉన్న ఆంగ్లం, తమిళం అనే రెండు భాష‌ల విధానాన్ని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది.

ఈ సంద‌ర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మీ నుండి ఎవ‌రూ చోరీ చేయ‌లేనిది ఏదైనా ఉందంటే అది ఏకైక సంప‌ద విద్య‌. చదువుకు ఎలాంటి ఆటంకం ఉండకూడ‌ద‌ని న‌మ్ముతున్నామ‌న్నారు.

విద్య‌ను ముందుకు తీసుకు వెళ్ల‌డ‌మే మా ప్ర‌భుత్వ ద్రావిడ న‌మూనా అని పేర్కొన్నారు. డిగ్రీలు పొందే విద్య కాదు కావాల్సింది త‌మ కాళ్ల మీద తాము నిల‌బడే విద్య‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్పారు సీఎం.

Also Read : స్మృతీ ఇరానీపై ట్వీట్లు తొల‌గించండి

Leave A Reply

Your Email Id will not be published!