Kiren Rijiju : కావాలనే కామెంట్ చేశారు – కిరన్ రిజిజు
ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై కామెంట్స్
Kiren Rijiju : దేశ అత్యున్నత పదవిని అధిష్టించిన ఆదివాసీ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై విమర్శలు పెరిగాయి.
భారతీయ జనతా పార్టీ మూకుమ్మడి దాడికి దిగింది. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీతో పాటు పలువురు శుక్రవారం రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. ద్రౌపది ముర్మును కలిశారు.
ఇదే సమయంలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా సైతం రాష్ట్రపతిని కలవడం విశేషం. ఇదిలా ఉండగా నిన్న ఎంపీ కామెంట్స్ పై దద్దరిల్లిన పార్లమెంట్ ఇవాళ కూడా సభలు సజావుగా సాగలేదు.
బేషరతుగా ఎంపీతో పాటు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ పెరిగింది. దీనిపై అధీర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, ఇందులో ఆలోచించాల్సింది ఏముందంటూ సోనియా ప్రశ్నించారు.
ఇది కూడా తీవ్ర దుమారం రేగింది. ఈ తరుణంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పొరపాటున నాలుక జారిందని అంటున్నారని కానీ ఆయన కావాలనే కామెంట్ చేశారంటూ ఆరోపించారు.
వెంటనే ద్రౌపది ముర్ముకు, భారత దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి. కిరన్ రిజిజు(Kiren Rijiju) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇదే సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఎంపీపై నిప్పులు చెరిగారు. భారతీయ సంస్కృతిని కించ పర్చడం అలవాటుగా మారిందన్నారు.
Also Read : నియంత్రించాలనే భావనను తుడిచేశాం