Jyotiraditya Scindia : అవినీతిలో తెలంగాణ టాప్ – సింధియా

కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్

Jyotiraditya Scindia : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత దూకుడు పెంచింది. గ‌త కొంత కాలం నుంచీ టీఆర్ఎస్, బీజేపీ క‌లిసి ఉన్నా ఈ మ‌ధ్య‌న మాట‌ల తూటాలు పేల్చుతూ వ‌స్తున్నారు ఇరు పార్టీల‌కు చెందిన నాయ‌కులు.

మ‌రో వైపు క‌మ‌లం, గులాబీ రెండూ ఒక్క‌టేన‌ని కేంద్రంలో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ అనే నాట‌కానికి తెర లేపారంటూ ఆరోపిస్తున్నారు టీపీసీసీ రేవంత్ రెడ్డి.

ఇక శుక్ర‌వారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia)  హైద‌రాబాద్ కు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా చార్మినార్ లోని భాగ్య ల‌క్ష్మి అమ్మ వారిని ద‌ర్శించుకుని పూజ‌లు చేశారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతి, అక్ర‌మాల‌లో ఇండియాలోనే తెలంగాణ టాప్ లో ఉంద‌న్నారు.

అభివృద్ధిలో మిగ‌తా రాష్ట్రాలు పోటీ ప‌డుతుంటే తెలంగాణ మాత్రం తిరోగ‌మ‌నంలో ప‌య‌నిస్తోంద‌ని విమ‌ర్శించారు సింధియా. కాంగ్రెస్ హ‌యాంలో కంటే త‌మ పార్టీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే తెలంగాణ రాష్ట్రానికి అత్య‌ధికంగా నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

త‌ప్పు చేయ‌మ‌ని ప‌దే ప‌దే చెబుతున్న టీఆర్ఎస్ నేత‌ల‌కు సీబీఐ, ఈడీ అంటే భ‌యం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. త‌ప్పులు చేసే వాళ్లే భ‌యాందోళ‌న‌కు లోన‌వుతార‌ని అందుకే కేసీఆర్ అండ్ టీం జ‌డుసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

మొత్తంగా రేపో మాపో ఈడీ రంగంలోకి దిగ‌నుందంటూ చెప్పారు. అయితే కేసీఆర్ ఫ్యామిలీని ఎప్పుడు అరెస్ట్ చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు బీజేపీ వ‌ద్ద ఇప్ప‌టికీ స‌మాధానం లేక పోవ‌డం విశేషం.

Also Read : రాజీ ప‌డం ప్ర‌యాణికుల భ‌ద్ర‌త ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!