Lalit Modi Case : ల‌లిత్ మోడీ ఆస్తి త‌గాదా కేసు వాయిదా

మ‌ధ్య వర్తిత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోప‌ణ‌

Lalit Modi Case : త‌మ కుటుంబంలో దీర్ఘ‌కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు సుప్రీంకోర్టు ఆదేశించిన మ‌ధ్యవ‌ర్తిత్వం విఫ‌ల‌మైంద‌ని ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ఐపీఎల్ మాజీ చీఫ్ ల‌లిత్ మోదీ(Lalit Modi) , ఆయ‌న త‌ల్లి బీనా మోదీ తెలిపారు.

ఈ విష‌యాన్ని వారు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంకు వివ‌రించారు. కాగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం..ల‌లిత్ మోదీ త‌ర‌పున హ‌రీశ్ సాల్వే, ఏఎం సింఘ్వీ, ఆయ‌న త‌ల్లి బీనా మోదీ త‌ర‌పున క‌పిల్ సిబ‌ల్ , ముకుల్ రోహ‌త్గీ స‌హా సీనియ‌ర్ న్యాయ‌వాదులు మ‌ళ్లీ వివాద ప‌రిష్కార అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని కోరింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 16న కుటంబ ఆస్తి వివాదానికి ప్ర‌త్య‌ర్థి ప‌క్షాల స‌మ్మ‌తిని తీసుకుంది న్యాయ‌స్థానం. కాగా మోడీల‌కు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించి సామ‌ర‌స్య పూర్వక ప‌రిష్కారాన్ని కొనుగొన‌డంలో సాయం చేసేందుకు మాజీ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ విక్ర‌మ్ జిత్ సేన్ , కురియ‌న్ జోసెఫ్ ల‌ను నియ‌మించింది.

దివంగ‌త పారిశ్రామిక వేత్త కేకే మోడీ భార్య బీన‌మా మోదీఈ త‌న కుమారుడిపై దాఖ‌లు చేసిన యాంటీ ఆర్బిట్రేష‌న్ ఇంజ‌క్ష‌న్ వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుపై ల‌లిత్ మోడీ చేసిన అప్పీల్ ను న్యాయ‌మూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది.

ఇదిలా ఉండ‌గా యుకెకు చెందిన ల‌లిత్ మోడీ(Lalit Modi) త‌న ప‌వ‌ర్ ఆఫ్ అట‌ర్నా ద్వారా అప్పీల్ దాఖ‌లు చేయ‌డంపై ముకుల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం కేసును వ‌చ్చే వారానికి వాయిదా వేసింది.

Also Read : చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన వెస్టిండీస్

Leave A Reply

Your Email Id will not be published!