SP Chief CM KCR : కేసీఆర్ అఖిలేష్ యాద‌వ్ కీల‌క భేటీ

జాతీయ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక ప్ర‌స్తావ‌న‌

SP Chief CM KCR : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు. శుక్ర‌వారం స‌మాజ్ వాది పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జాతీయ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు.

ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను కాపాడేందుకు, కేంద్రంపై దాడుల‌ను మ‌రింత ఉధృతం చేసేందుకు కేసీఆర్ భావ సారూప్య‌త గ‌ల పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు.

జాతీయ రాజ‌కీయాల గురించి కూడా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కి వ్య‌తిరేకంగా కాంగ్రెసేత‌ర ప్ర‌తిప‌క్ష కూట‌మిని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు సీఎం కేసీఆర్.

కేసీఆర్(SP Chief CM KCR) సాద‌ర స్వాగ‌తం ప‌లికారు అఖిలేష్ యాద‌వ్ కు. శాలువా క‌ప్పారు. గులాబీ బొకేతో శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌మాజ్ వాది పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ గోపాల్ యాద‌వ్ కేసీఆర్ అధికారిక నివాసంలో క‌నిపించారు.

ప్ర‌ధానంగా జాతీయ రాజ‌కీయాలు, చోటు చేసుకున్న ప‌రిణామాలు, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు, ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి చ‌ర్చించిన‌ట్లు టాక్.

ఇదిలా ఉండ‌గా ఈనెల ప్రారంభంలో కేసీఆర్ సీఎంలు మ‌మ‌తా బెన‌ర్జీ, అర‌వింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్ , జాతీయ నేత‌లు తేజ‌స్వి యాద‌వ్ , శ‌ర‌ద్ ప‌వార్ ల‌తో మాట్లాడారు.

సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించారు. అంత‌కు ముందు త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, ప‌శ్చిమ బెంగాల్ వెళ్లారు. అనంత‌రం ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న బ‌డుల‌ను చూసి విస్తు పోయారు.

Also Read : ఆరోప‌ణ‌లు స‌రే అరెస్ట్ లు ఎప్పుడు

Leave A Reply

Your Email Id will not be published!