Kesineni Nani Notice : ఆ ఎంపీకి బ్యాంక్ నోటీసుపై కలకలం
కేశినేని నాని వ్యవహారంపై సర్వత్రా చర్చ
Kesineni Nani Notice : బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన అప్పులకు సంబంధించి ఏకంగా బ్యాంక్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.
ఎంతకూ చేసిన అప్పులు చెల్లించక పోవడంతో ఏకంగా పేపర్ నోటీసు ఇచ్చే దాకా వెళ్లింది. ఈ మధ్యన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రంలో ఇలాంటి సీను కూడా ఒకటి చర్చకు దారి తీసింది.
అధికారం ఉంది కదా అని ఎడా పెడా అప్పులు చేయడం ఆ తర్వాత కట్టమని అడిగితే దర్పాన్ని ప్రదర్శించడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది.
ఇప్పటికే దేశం దాటి పోయిన వాళ్లు ఎందరో ఉన్నారు బ్యాంకులకు ఎగనామం పెట్టి. తాజాగా ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అప్పుల వ్యవహారం బట్ట బయలైంది.
పెద్ద ఎత్తున ఆయన రుణాలు తీసుకున్నారు. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించక పోవడంతో సదరు బ్యాంకు అధికారులు చేసేదిలేక డెబిట్
రికవరీ ట్రిబ్యునల్ లో కేసు వేశారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంపీ కార్గో అండ్ క్యారియర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో అప్పులు తీసుకున్నారు. ఎంత చెప్పినా
కట్టక పోవడంతో చివరకు చేసేది ఏమీ లేక నోటీసులు పంపించారు.
ఎంపీ అప్పుల బాగోతంపై స్పందించిన ట్రిబ్యునల్ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. డెబిట్ రికవరీ ట్రిబ్యూనల్ ముందు హాజరు
కావాలంటూ ఆదేశించింది.
అంతకు ముందు యూబీఐ డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించింది. దీంతో డీఆర్టీ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా 2017లో తన ట్రావెల్ సంస్థను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
బస్సులను అడ్డం పెట్టుకుని కోట్లు తెచ్చుకున్నాడంటూ అప్పట్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపణలు చేశారు. ట్రావెల్స్ సంస్థను మూసేసి కార్గో
సర్వీస్ స్టార్ట్ చేశాడు.
ప్రస్తుతం బ్యాంకు నోటీసులు, డీఆర్టీ జారీ చేసిన పత్రికా ప్రకటన బెజవాడలో చర్చనీయాంశం గా మారింది.
Also Read : బాబు’ అబద్దాలలో దిట్ట మోసాల పుట్ట