ADR Regional Parties : విరాళాల సేకరణలో ఐదు పార్టీలు టాప్
రెండో స్థానంలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
ADR Regional Parties : పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ (ఏడీఆర్) ప్రాంతీయ పార్టీల విరాళాల వివరాల జాబితా ప్రకటించింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల గురించి వెల్లడించింది.
మొత్తం అందిన వివరాలలో 91 శాతం ఐదు పార్టీలకు వెళ్లడం విశేషం. ఏడీఆర్ ప్రతి ఏటా నివేదిక తయారు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాలపై ఫోకస్ పెడుతుంది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం 27 ప్రాంతీయ పార్టీలు విరాళాలు అందుకున్నాయి. మొత్తం విరాళాల్లో 91 శాతంన అంటే రూ. 113.791 కోట్లు ఐదు సంస్థలకు చేరాయని ఏడీఆర్ వెల్లడించింది.
ఇక విరాళాలు ప్రకటించిన మొదటి ఐదు ప్రాంతీయ పార్టీలు జనతాద్ (యునైటెడ్ ) , ద్రవిడ మునేట్ర కజగం (డీఎంకే) , ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) , ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్ ) , తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఉన్నాయి.
జేడీయూ, డీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు తమ విరాళాలు పెరిగాయని ప్రకటించాయి. ఆప్, ఐయుఎంఎల్ 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విరాళాలు తగ్గినట్లు నివేదించాయని తెలిపింది ఏడీఆర్(ADR Regional Parties).
ఇదే సమయంలో డీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ , మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) 2019-20 , 2020-21 మధ్య విరాళాల ద్వారా ఆదాయంలో గరిష్ట శాతం పెరిగింది.
దేశంలోని 54 ప్రాంతీయ పార్టీలలో కేవలం ఆరు మాత్రమే తమ విరాళాల నివేదికలను నిర్ణీత వ్యవధిలో ఈసీఐకి సమర్పించాయి.
27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాలు రూ. 20,000 పైన, అంతకంటే తక్కువ కలిపి 3,051 విరాళాల నుండి రూ. 124.53 కోట్లుగా ఉన్నాయి.
Also Read : భవిష్యత్తులో వ్యాట్..పన్నులు పెంచం