TMC MLA ED : టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణికి ఈడీ షాక్
నిన్న మంత్రి పార్థ ఛటర్జీ నేడు ఎమ్మెల్యే
TMC MLA ED : కేంద్ర సర్కార్ సీరియస్ గా ఉంది పశ్చిమ బెంగాల్ విషయంలో. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది టీఎంసీ. ముచ్చటగా మూడోసారి మమతా బెనర్జీ మళ్లీ పవర్ లోకి వచ్చారు.
ఆనాటి నుంచి నేటి దాకా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. దీంతో టీఎంసీ సర్కార్ ను టార్గెట్ చేసింది కేంద్రం. ఈ మేరకు సీఎం దీదీకి వెన్నుదన్నుగా ఉన్న వారిపై ఫోకస్ పెట్టింది.
ఈ మేరకు ఇప్పటికే వర్కవుట్ అయ్యింది. ఈడీ దెబ్బకు మంత్రి పార్థ ఛటర్జీతో పాటు అనుచరురాలిగా పేరొందిన ప్రముఖ నటి అర్పిత ముఖర్జీ ఇళ్లపై దాడులు చేసింది. రూ. 50 కోట్ల నగదు, 5 కేజీల బంగారం దొరికింది.
ఇద్దరినీ అరెస్ట్ చేసింది ఈడీ. తాజాగా ఇదే టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణిని టార్గెట్ చేసింది. కళ్యాణి సాల్వెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆహార తయారీ సంస్థను 2002లో ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టిక్కెట్ పై పోటీ చేశారు. విజయం సాధించారు. కానీ పార్టీకి రాజీనామా చేయకుండానే టీఎంసీలోకి ఫిరాయించారు.
సదరు ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఫుడ్ అండ్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీకి , కోల్ కతాకు చెందిన ఎరండు చానెళ్లకు మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ(TMC MLA ED) నుంచి నోటీసులు అందాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
టీఎంసీలో చేరాక కృష్ణ కళ్యాణి తృణమూల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఈడీ కంట్లో పడ్డారు. ప్రస్తుతం బెంగాల్ ను ఈడీ టార్గెట్ చేసినట్లు కనబడుతోంది.
Also Read : పార్థ ఛటర్జీ అరెస్ట్, పార్టీకి తీరని అవమానం