Sanjay Raut : గ‌వ‌ర్న‌ర్ క్షమాప‌ణ చెప్పాల్సిందే – సంజ‌య్ రౌత్

కోషియార్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

Sanjay Raut : మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాలు వేడిని రాజేస్తూనే ఉన్నాయి. నిన్న‌టి దాకా శివ‌సేన వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారగా తాజాగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారీ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు మ‌రాఠాలో క‌ల‌క‌లం రేపాయి.

గుజ‌రాతీలు, రాజ‌స్థానీలు గ‌నుక మహారాష్ట్ర నుంచి వెళ్లి పోతే ముంబై, థానే నుండి డ‌బ్బులంటూ మిగ‌ల‌వ‌ని అన్నారు. ముంబై ఇక దేశ ఆర్థిక రాజ‌ధానిగా ఉండ లేక పోతోంద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. భ‌గ‌త్ సింగ్ కోషియారీ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ గా స్పందించారు శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut). మొద‌టి నుంచీ గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేయ‌డం లేద‌ని, కేంద్రానికి ఊడిగం చేస్తున్నాడంటూ ఆరోపించారు.

క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే మ‌రాఠీ ప్ర‌జ‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ అవ‌మానించారంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శివ‌సేనకు వ్య‌తిరేకంగా, మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ , ఎన్సీపీ నేత‌లు కూడా తీవ్ర అభ్యంత‌రం తెలిపారు గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌లు జైరాం ర‌మేశ్ , స‌చిన్ సావంత్ కూడా స్పందించారు.

గ‌త కొంత కాలంగా మహారాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ శివ‌సేన గా మారింది. మొద‌టి నుంచీ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut) కోషియార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. మ‌రాఠాను గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : మ‌ద్యం పాల‌సీపై ఢిల్లీ స‌ర్కార్ వెన‌క్కి

Leave A Reply

Your Email Id will not be published!