Sanjay Raut : సంజయ్ రౌత్ కు ఈడీ బిగ్ షాక్
ఇంటిపై దాడికి దిగిన అధికారులు
Sanjay Raut : కేంద్ర సర్కార్ పై నిత్యం నిప్పులు చెరుగుతూ వస్తున్న శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.
ఇప్పటికే మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. ఒక్క సారి మాత్రమే సంజయ్ రౌత్ ఈడీ ఆఫీసుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు.
కానీ మరోసారి జారీ చేసిన సమన్లకు ఎంపీ స్పందించ లేదు. దీంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆదివారం ముంబైలో ఉంటున్న సంజయ్ రౌత్ ఇంటిపై దాడులు చేస్తోంది ఈడీ.
ఈ మేరకు మందీ మార్బలంతో బయలు దేరింది. ప్రస్తుతం ముంబైలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాగా తాను ఏ తప్పు చేయలేదని అంటున్నారు సంజయ్ రౌత్(Sanjay Raut) .
ఇక విచారణలో భాగంగా రౌత్ భార్య వర్షా రౌత్ , ఆయనకు సంబంధించిన ఇద్దరికి చెందిన రూ. 11.15 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
సంజయ్ రౌత్ అసిస్టెంట్ , గురు ఆశిష్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన ప్రవీణ్ ఎం. రౌత్, పాల్ఘర్ , సఫాలే, పద్ఘా పట్టణాలలో కలిగి ఉన్న భూమి, అటాచ్ చేసిన ఆస్తుల్లో దాదర్ వర్షా రౌత్ కు చెందిన ఫ్లాట్ తో పాటు అలీ బాగ్ లోని కిహిమ్ , బీచ్ లో సుజిత్ పాట్కర్ భార్య స్వప్న పాట్కర్ సంయుక్తంగా ఉన్న ఎనిమిది ప్లాట్లు కూడా ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది.
అలీ బాగ్ ల్యాండ్ డీల్ లో రిజిస్టర్డ్ విలువ కాకుండా అమ్మకందారులకు నగదు చెల్లింపులు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
Also Read : గవర్నర్ క్షమాపణ చెప్పాల్సిందే