Jharkhand MLAs Caught : బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ బట్ట బయలు
నోట్ల కట్టలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Jharkhand MLAs Caught : కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల వాహనాల్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయట పడ్డాయి. దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీయేనంటూ సంచలన ఆరోపణలు చేసింది కాంగ్రెస్.
ఇప్పటి వరకు ఎనిమిదేళ్ల కేంద్ర సర్కార్ పాలనలో 9 రాష్ట్రాలను అక్రమంగా పడగొట్టిందని తాజాగా మరాఠాలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిందని ఆరోపించింది.
ఇదే సమయంలో బీజేపీ టార్గెట్ ఛత్తీస్ గఢ్ , ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఉందని తమిళనాడు జోలికి మాత్రం వెళ్లదని పేర్కొంది. బీజేపీ ఆపరేషన్ ఈ డబ్బులు పట్టుబడడంతో బట్ట బయలైందని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది.
ప్రస్తుతం డబ్బులతో ఎమ్మెల్యేలు దొరకడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Jharkhand MLAs) తమ కారులో భారీ మొత్తంలో నగదుతో బెంగాల్ లో పట్టుబడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేలకు డబ్బులు బీజేపీ సరఫరా చేసిందంటూ ఆరోపించింది కాంగ్రెస పార్టీ. కాగా దీనిని బీజేపీ తిప్పి కొట్టింది. జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వ అవినీతికి ఇది పరాకాష్ట అంటూ ఆరోపించింది.
హౌరా రూరల్ పోలీసుల తనిఖీలో పట్టుబడింది డబ్బు. జమతారా నుండి ఇర్ఫాన్ అన్సారీఈ, ఖిజ్రీ నుండి రాజేష్ కచ్చప్ , కొలెబిరా నుండి నమన్ బిక్సల్ కొంగరి నుంచి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా పట్టుబడిన డబ్బులు పెద్ద మొత్తంలో ఉన్నాయని నోట్లు లెక్కించేందుకు యంత్రాలు వాడాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
Also Read : డీహెచ్ఎఫ్ఎల్ స్కాం ‘ఛాపర్’ స్వాధీనం