Raghuram Rajan : ఉదార‌వాద ప్ర‌జాస్వామ్యం దేశానికి అవ‌స‌రం

ర‌ఘురామ్ రాజ‌న్ షాకింగ్ కామెంట్స్

Raghuram Rajan : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్(Raghuram Rajan) షాకింగ్ కామెంట్స్ చేశారు. మైనార్టీల‌ను రెండో త‌ర‌గ‌తి పౌరులుగా మార్చ‌డం వ‌ల్ల దేశానికి అత్యంత ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు.

మెజారిటీ వాదాన్ని తీవ్రంగా హెచ్చ‌రించారు. మైనార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం వ‌ల్ల దేశంలో రాజ‌కీయ నాయ‌కులు ఉద్యోగ సంక్షోభాన్ని తిప్పి కొట్టేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఏమి జ‌రుగుతుందో శ్రీ‌లంక ఒక ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

ఆల్ ఇండియా ఫ్రొఫెష‌న‌ల్స్ కాంగ్రెస్ 5వ స‌ద‌స్సులో ర‌ఘురామ్ రాజ‌న్ మాట్లాడారు. ఉదార‌వాద ప్ర‌జాస్వామ్యాన్ని, దాని సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయడంతోనే భార‌త దేశ భ‌విష్య‌త్తు దిగా ఉంద‌న్నారు.

ఆర్థిక వృద్దిని సాధించ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. రాయ్ ఊర్ లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ స‌ద‌స్సు నిర్వ‌హించారు.

పెద్ద సంఖ్య‌లో ఉన్న మైనార్టీల‌ను రెండో త‌ర‌గ‌తి పౌరులుగా మార్చే ఏ ప్ర‌య‌త్న‌మైనా దేశాన్ని విభజించ‌డ‌మేన‌ని హెచ్చ‌రించారు ర‌ఘురామ్ రాజ‌న్(Raghuram Rajan). భార‌త ఆర్థికాభివృద్ధికి ఉదారవాద ప్ర‌జాస్వామ్యం ఎందుకు అవ‌స‌రం అనే అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌న్న భావ‌న కొంద‌రి ప్ర‌జ‌ల్లో నెల‌కొంద‌న్నారు. వ‌స్తువులు, మూల ధ‌నాన్ని నొక్కి చెప్పే కాలం చెల్లిన అభివృద్ది న‌మూనాపై ఆధార‌ప‌డి ఉంద‌న్నారు ర‌ఘురామ్ రాజ‌న్.

ఆర్ధిక వృద్ది ప‌రంగా చూస్తే మ‌నం వెళుతున్న మార్గాన్ని పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మాజీ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్. అధికంగా ఉన్న మైనార్టీల‌ను రెండో త‌ర‌గ‌తి పౌరుల‌ను చేసే ఏ ప్ర‌య‌త్న‌మైనా దేశాన్ని విభ‌జించి అంత‌ర్గ‌త ఆగ్ర‌హాన్ని సృష్టిస్తుంద‌న్నారు.

Also Read : ఆగ‌స్టు 5న పీఎం ఇల్లు ముట్ట‌డి – కాంగ్రెస్

Leave A Reply

Your Email Id will not be published!