Sanjay Raut : శివసేనను వీడను చచ్చినా లొంగను – రౌత్
మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన శివసేన ఎంపీ
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం రౌత్ ఇంటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులకు దిగింది.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాను ప్రశ్నిస్తున్నందుకే మోదీ సర్కార్ టార్గెట్ చేసిందంటూ ఆరోపించారు.
ఒకవేళ తనను చంపినా తన గొంతు అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా జూలై 20, 27న తమ ఆఫీసుకు రావాలంటూ రెండుసార్లు సమన్లు జారీ చేసినా ఎంపీ సంజయ్ రౌత్ హాజరు కాలేదని ఈడీ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆయన ఇంటిపై సోదాలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ముంబైలోని చాల్ లో ఉంటున్న రౌత్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. శివసేన పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నారు ఎంపీ.
అంతే కాదు కష్ట కాలంలో సైతం శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అండగా నిలిచారు. కేంద్రంపై నిప్పులు చెరుగుతూ వచ్చారు సంజయ్ రౌత్. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏకి పారేశారు.
ఈ తరుణంలో కావాలనే తన గొంతు నొక్కేందుకే ఈడీని తనపై ప్రయోగించారంటూ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
తనకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదన్నారు.
శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాలా సాహెబ్ ఠాక్రే అనుచరుడిగా ప్రమాణం చేసి చెబుతున్నా. ఎక్కడా పొరపాటు చేయలేదన్నారు. పోరాడటమే తమకు మరాఠా యోధుడు నేర్పించాడన్నారు సంజయ్ రౌత్. శివసేనను వీడను చచ్చినా లొంగి పోను.
Also Read : డీహెచ్ఎఫ్ఎల్ స్కాం ‘ఛాపర్’ స్వాధీనం