Modi Hasina : మెగా ప‌వ‌ర్ ప్రాజెక్టుకు ప్ర‌ధానుల శ్రీ‌కారం

ప్ర‌ధానితో పాటు బంగ్లా ప్ర‌ధాని షేక్ హ‌సీనా

Modi Hasina :  బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న కోసం భార‌త‌దేశాన్ని  సంద‌ర్శించ‌నున్నారు.

ఈ స‌మ‌యంలోనే 1320 మెగా వాట్ల మైత్రీ సూప‌ర్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర స్టేష‌న్ ను సంయుక్తంగా ప్రారంభిస్తార‌ని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ లో అతి పెద్ద ప‌వ‌ర్ ప్లాంట్ గా దీనిని ఏర్పాటు చేశారు.

బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్ షిప్ క‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్ నిర్మించింది. భార‌త్ కు చెందిన నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ , బంగ్లాదేశ్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డు మ‌ధ్య ఫిఫ్టి ఫిఫ్టీ (50-50) జాయింట్ వెంచ‌ర్ ద్వారా ఏర్పాటు చేశారు.

దీని ప్రాజ‌క్టు విలువ 1.5 బిలియ‌న్ డాల‌ర్లు. అత్యంత భారీ ఖ‌ర్చుతో దీనిని నిర్మించ‌డం విశేషం. బంగ్లా దేశ్ ప్ర‌ధాని హ‌సీనా(Hasina) సెప్టెంబ‌ర్ 5 , 7 తేదీల మ‌ధ్య ఎప్పుడైనా భార‌త దేశాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఈ టూర్ లో భాగంగా ఆమె రెండు లేదా మూడు రోజుల పాటు ఉంటార‌ని స‌మాచారం. కాగా ఢాకా భార‌త దేశానికి అత్యంత స‌న్నిహిత మిత్ర దేశాల‌లో ఒక‌టిగా ఉన్నందు వ‌ల్ల మోదీ(Modi)  ప్ర‌భుత్వం ఈ టూర్ కు అత్య‌ధిక ప్రాముఖ్య‌త ఇస్తోంది.

పీఎం హ‌సీనా ఢిల్లీకి రాక ముందే భార‌త్ బంగ్లాదేశ్ వాణిజ్యం కోసం కోల్ క‌తా – చ‌టో గ్రామ్ – మోంగ్లా ఓడ రేవుల మ‌ధ్య ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు.

కోల్ క‌తా నుండి మొద‌టి నౌక ఆగ‌స్టు 5 న ప్రారంభం కానుంది. ఈశాన్యా ప్రాంతానికి చేరుకునేందుకు స‌మ‌యం, దూరం త‌క్కువ‌వుతుంది.

Also Read : స‌మున్న‌త భార‌తం త్రివ‌ర్ణ ప‌తాకం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!