Devendra Fadnavis : గవర్నర్ కామెంట్స్ సమర్థించను – ఫడ్నవీస్
మరాఠా ప్రజలు యోధులన్న డిప్యూటీ సీఎం
Devendra Fadnavis : మహారాష్ట్ర ప్రజలు యోధులు. వారు ఎన్నటికీ తక్కువ కాదు. వారిని విస్మరించే ప్రసక్తి లేదు. వాళ్లు లేకుండా ఈ దేశంలో పూర్తి నిర్మాణం జరగలేదన్నది వాస్తవం. వాళ్లు కలలకు రెక్కలు తొడిగారు.
వారు నిరంతరం శ్రమజీవులు. వారు చేసిన ఈ నిర్మాణమే నేటి ముంబై నగరం. మరాఠా అంటేనే పోరాటానికి ప్రతీక. నిత్యం కష్టపడటం ఆపై ఎంతకైనా ఎందాకైనా పోరాడే స్పూర్తి వాళ్లది.
దీనిని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis). తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ప్రధానంగా ముంబై నగరంపై తన అక్కసు వెళ్లగక్కాడు. ఆపై మనుషుల మధ్య తీవ్ర విభేదాలు వచ్చేలా ఉన్నాయిన ఆయన చేసిన వ్యాఖ్యలు.
గుజరాతీలు, రాజస్థానీలు గనుక ఇప్పుడు ముంబై మహా నగరాన్ని విడిచి వెళ్లితే ఖాళీ తప్ప ఏమీ మిగలదన్నాడు. ఆపై దేశ ఆర్థిక రాజధానిగా ఇక ఉండబోదన్నాడు.
ఇక మీరంతా ఉట్టి చేతులతో ఉండాల్సి వస్తుందని గవర్నర్ పేర్కొన్నాడు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి.
ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. గవర్నర్ ను తప్పిస్తారా జైలుకు పంపిస్తారా అని నిలదీశారు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే.
ఈ తరుణంలో ఫడ్నవీస్ తాను గవర్నర్ వ్యాఖ్యల్ని సమర్థించనని స్పష్టం చేశారు. ముంబై వాసులు ఎన్నటికీ గొప్ప వారంటూ స్పష్టం చేశారు.
Also Read : ఆరు రాష్ట్రాలలో ఎన్ఐఏ సోదాలు