Sanjay Raut : శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ అరెస్ట్

చ‌ని పోయినా ప్రశ్నిస్తూనే ఉంటా

Sanjay Raut : శివ‌సేన పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. భూ కుంభ‌కోణం కేసులో ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజ‌య్ రౌత్ సుదీర్ఘ దాడుల త‌ర్వాత ఆదివారం అదుపులోకి తీసుకుంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

నిందితుడితో సంజ‌య్ రౌత్ కు ఉన్న వ్యాపార లావాదేవీలు, ఇత‌ర సంబంధాల గురించి, అత‌ని భార్య కు సంబంధించిన ఆస్తి లావాదేవీల గురించి తెలుసు కునేందుకు అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ముంబై లోని తూర్పు శివారు లోని బండ‌ప్ లో సంజ‌య్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు చేప‌ట్టింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో శివ‌సేన నాయ‌కుడు రెండు సార్లు విచార‌ణ‌కు హాజ‌రు కాలేద‌ని, స‌మ‌న్లు ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించింది ఈడీ.

ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు ద‌ర్యాప్తు ఏజెన్సీ బృందం సీఐఎస్ఎఫ్ అధికారుల‌తో క‌లిసి సంజయ్ రౌత్(Sanjay Raut)  ఇంటికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సోదాలు చేప‌ట్టారు. విలువైన ప‌త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ కేసుకు సంబంధించి మ‌రింత స‌మాచారం తెలుసు కునేందుకు గాను సంజ‌య్ రౌత్ ను అదుపులొకి తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది ఈడీ.

శివ‌సేన ఎంపీ గ‌త కొంత కాలం నుంచీ ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్ ల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు శివ‌సేన పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర వేసినా సంజ‌య్ రౌత్ మాత్రం ఉద్ద‌వ్ ఠాక్రే వైపు ఉన్నారు. త‌న‌ను కావాల‌ని కేంద్ర స‌ర్కార్ టార్గెట్ చేసిందంటూ ఆరోపించారు.

Also Read : గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ స‌మ‌ర్థించ‌ను – ఫ‌డ్న‌వీస్

Leave A Reply

Your Email Id will not be published!