Arvind Panagariya : శ్రీ‌లంక సంక్షోభం భార‌త్ కు గుణ‌పాఠం

నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్న్ ప‌న‌గారియా

Arvind Panagariya : నిన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మ‌న్ ర‌ఘురామ్ రాజ‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మైనార్టీల‌ను ఓటు బ్యాంకుగా చూస్తే ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు.

అంతే కాదు ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత దారుణ‌మైన స్థితికి చేరుకుంద‌ని హెచ్చ‌రించారు. ఈ త‌రుణంలో తాజాగా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మ‌న్ అర‌వింద్ ప‌న‌గారియా (Arvind Panagariya) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తీవ్ర ఆర్థిక‌, ఆహార‌, విద్యుత్, గ్యాస్ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతోంది శ్రీ‌లంక. దేశాధ్య‌క్షుడు మారినా ద్వీప దేశం ప‌రిస్థితి దారుణంగా ఉంది. అయితే శ్రీ‌లంక సంక్షోభంతో భార‌త్ ను పోల్చ‌వ‌ద్ద‌ని కోరారు.

అయితే ఆ దేశం నుంచి గుణ పాఠాల‌ను చూసి నేర్చు కోవాల‌ని సూచించారు ప‌న‌గారియా. 1991 నుంచి దేశంలో ఆర్థిక ప‌రిస్థితి ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంద‌న్నారు.

అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వాల‌న్నీ స్థూల ఆర్థిక ప‌రిస్థితులు క‌ట్టు త‌ప్ప‌కుండా దేశాన్ని సంర‌క్షిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

విచిత్రం ఏమిటంటే భార‌త్ లో ప్ర‌ధాన స‌మ‌స్య నిరుద్యోగం కాద‌ని..ఉత్పాద‌క‌త‌, జీతాల స్థాయి త‌క్కువ‌గా ఉండ‌ట‌మేన‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు ప‌న‌గారియా.

2020-21లో 4.2 శాతానికి దిగి వ‌చ్చింద‌ని తెలిపారు. కొంద‌రు ఆర్థిక నిపుణులు త‌మ స్వంత అభిప్రాయాల‌ను వెలిబుచ్చ‌డంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

దేశానికి సంబంధించిన జీడీపీ, కీల‌క గ‌ణాంకాల సేక‌ర‌ణ అంతా కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌మాణాల‌తోనే జ‌రుగుతోంద‌న్నారు. కొంద‌రు చేస్తున్న విమ‌ర్శ‌లపై ప‌న‌గారియా మండిప‌డ్డారు.

ఒక ర‌కంగా చూస్తే ఆయ‌న మోదీ స‌ర్కార్ కు మ‌ద్ద‌తు ప‌లికారు. కాగా ర‌ఘురామ్ రాజ‌న్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : త‌గుల‌బెట్టి ఇంటికి వెళ్ల‌మంటే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!