Sanjay Raut : చంపినా ప్రశ్నిస్తూనే ఉంటా – సంజయ్ రౌత్
పార్టీ వీడను యుద్దం చేయడం ఆపను
Sanjay Raut : శివసేన పార్టీకి అతడు ప్రధాన నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ రౌత్ అన్నీ కూడా. ఈ రాజ్యసభ ఎంపీ పార్టీకే కాదు సామ్నా పత్రికకు కళ్లు కూడా. మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగాడు.
మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే వారసుడినంటూ ప్రకటించాడు. సంజయ్ రౌత్ ముందు నుంచీ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి మోదీని, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను ఏకి పారేస్తున్నారు.
ఆపై తమకు కొరకొరరాని కొయ్యగా తయారైన రౌత్ ను ఎలాగైనా అణిచి వేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈడీని ఉసిగొల్పింది. భూ కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది.
ఆపై కేసు నమోదు చేసింది. రూ. 11.15 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. సంజయ్ రౌత్(Sanjay Raut) ను జూలై 31న అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా ఈడీ గంటల తరబడి ఎంపీని ప్రశ్నించింది.
అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. అప్పటికే మరాఠాకు చెందిన శివ సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఇదిలా ఉండగా సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేశారు.
బీజేపీ అతడికి భయపడింది. అరెస్ట్ చేస్తున్నట్లు ఎలాంటి పత్రాన్ని ఇవ్వలేదు. ఆయనను ఇరికించారంటూ ఎంపీ సోదరుడు సునీల్ రౌత్ ఆరోపించారు.
కాగా తాము రెండు సార్లు సమన్లు పంపించామని కానీ సంజయ్ రౌత్(Sanjay Raut) హాజరు కాలేదని ఈడీ ఆరోపించింది. అందుకే సోదాలు చేపట్టి అరెస్ట్ చేశామని స్పష్టం చేసింది. ఇవాళ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఆ తర్వాత కస్టడీని కోరే అవకాశం ఉంది.
Also Read : శివసేన పార్టీ అంతానికి కేంద్రం కుట్ర