CM Pill Lawyer Arrest : సీఎంపై పిల్ వేసిన న్యాయవాది అరెస్ట్
హేమంత్ సోరేన్ అక్రమాలకు పాల్పడ్డారు
CM Pill Lawyer Arrest : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఆధారాలతో సహా పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాది రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
జార్ఖండ్ పోలీసులు అతడిపై జారీ చేసిన వారెంట్ ను అమలు చేస్తూ హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ నుండి తీసుకు వెళ్లారు. ఇదిలా ఉండగా న్యాయవాది వద్ద రూ. 50 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు.
కోల్ కతా పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ (డీడీ) ప్రజలను మోసగించి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు న్యాయవాదిపై(CM Pill Lawyer Arrest) కేసు నమోదైంది.
జార్ఖండ్ లో న్యాయవాది రాజీవ్ కుమార్ పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోల్ కతాకు చెందిన ఒక వ్యాపారవేత్తపై రాంచీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశాడు.
పిల్ ఉపసంహరించు కోవడానికి రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడు. ప్రారంభ చర్చలలో సదరు వ్యాపారవేత్త రూ. 4 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. ప్రారంభ చర్చలలో ఒప్పందం మేరకు రూ. 1 కోటి ఇచ్చాడు.
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడు మొదటి విడతగా రూ. 50 లక్షల నగదు ఇచ్చాడు న్యాయవాది రాజీవ్ కుమార్ కు. తనకు కేంద్ర సంస్థలతో సంబంధాల ఉన్నాయని, ఆయన ఇల్లు , కార్యాలయాలపై దాడులు చేస్తానని వ్యాపారవేత్తకు చె్పారు.
600కు పైగా పిల్ లు వేయడం వెనుక అతడి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా సీఎం సోరెన్ పై రెండు పిల్ లు దాఖలయ్యాయి.
మైనింగ్ పోర్ట్ ఫోలియోను కలిగి ఉండగా షెల్ కంపెనీలు , మనీ లాండరింగ్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
Also Read : చదువు కోవడమే వీళ్లు చేసిన పాపమా