Parliament Session : ధరల పెరుగుదలపై చర్చకు నోటీసు
ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన
Parliament Session : పార్లమెంట్ ఉభయ సభలు జూలై 18న ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సభలు సజావుగా సాగలేదు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. కేంద్ర సర్కార్ అడ్డగోలుగా పెంచుకుంటూ పోయిన నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశాయి.
ఇందుకు సంబంధించి చర్చించాలని పట్టుపట్టాయి. కానీ మోదీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. లోక్ సభ, రాజ్యసభ లో గందరగోళం సృష్టించారు సభ్యులు.
దీంతో లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. ఇక రాజ్యసభలో 24 మందిని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ ను విధించడాన్ని నిరసిస్తూ ఎంపీలు పార్లమెంట్ భవనం ఆవరణలో 50 గంటల పాటు నిరసన చేపట్టారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
చివరకు సభలు సజావుగా జరగడం లేదని భావించిన కేంద్రం ఎట్టకేలకు దిగి వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు అంగీకరించింది.
ఈ మేరకు చర్చ జరపాలని కోరుతూ నోటీసు ఇచ్చింది. ఇందుకు సంబంధించి సోమవారం లోక్ సభలో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మనీష్ తివారీ, శివసేన పార్టీకి చెందిన వినాయక్ రౌత్ నోటీసులు సమర్పించారు.
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై వచ్చే వారం పార్లమెంట్ లో చర్చ జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం బుధవారం చివరి సారిగా పేర్కొంది.
రాజ్యసభలో(Parliament Session) టీఎంసీ డోలా సేన్, మౌసమ్ నూర్ మహిళలపై నేరాల నివారణ ఆవశ్యకతపై తక్షణమే చర్చించాలని కోరారు. టీఎంసీకి కకోలి ఘోష్ దస్తీదార్ ఇదే నోటీసును సమర్పించారు.
Also Read : సీఎంపై పిల్ వేసిన న్యాయవాది అరెస్ట్