Sanjay Arora : ఢిల్లీ సీపీగా కొలువు తీరిన సంజయ్ అరోరా
తమిళనాడుకు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్
Sanjay Arora : తమిళనాడుకు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్ అధికారి సంజయ్ అరోరా ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలో కీలక పదవులు చేపట్టారు.
ఫారెస్ట్ బ్రిగేండ్ వీరప్పన్ ను వేటాడిన పోలీసుల టాస్క్ ఫోర్స్ లో ఒకప్పుడు భాగంగా ఉన్నారు సంజయ్ అరోరా(Sanjay Arora). అంతకు ముందు 38 ఏళ్ల సర్వీసు తర్వాత ఆదివారం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్థానా పదవీ విరమణ చేశారు.
రాకేశ్ ఆస్థానా నుంచి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు సంజయ్ అరోరా. న్యూఢిల్లీ లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సంజయ్ అరోరా కొలువు తీరారు.
ఇదిలా ఉండగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) పారా మిలటరీ దళానికి నేతృత్వం వహించారు సంజయ్ అరోరా. ఒక రోజు కిందట దేశ రాజధాని ఢిల్లీకి పోలీస్ కమిషనర్ గా నియమించింది కేంద్రం.
అత్యంత కీలకమైన పదవి ఇది. ఇక 57 ఏళ్ల సంజయ్ అరోరా(Sanjay Arora) ఢిల్లీ పోలీస్ కి నాయకత్వం వహించిన రెండో ఏజీఎంయుటీ కేడర్ కాని ఐపీఎస్ అధికారి. 1978లో ఢిల్లీ పోలీస్ చట్టం ఆమోదించిన తర్వాత , కమిషనరేట్ స్థాపించిన తర్వాత ఇది మూడోది.
సంజయ్ అరోరా రాజస్థాన్ లోని మాల్వియా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీర్ చదివారు. 1991ల వీఐపీలకు భద్రత కల్పించే ప్రత్యేక భద్రతా బృందాన్ని ఏర్పాటు చేయడంలో సంజయ్ అరోరా కీలక పాత్ర పోషించారు.
Also Read : తుపాకికి తుపాకీతోనే సమాధానం చెప్పాలి