Chikoti Praveen ED : ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్
అతడి ల్యాప్ టాప్ లో ఏముందో
Chikoti Praveen ED : క్యాసినో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. మనీ లాండరింగ్ కేసు నమోదైంది చీకోటి ప్రవీణ్ తో పాటు ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఇప్పటికే సమన్లు కూడా జారీ చేసింది.
అతడి లిస్టులో 18 మందికి పైగా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సోమవారం ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు చీకోటి తన అనుచరులతో కలిసి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
ఇంత పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు ఎలా సమకూరాయనే దానిపై ఈడీ విచారణ జరపనుంది. చీకోటి వెనుక వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో పాటు సినీ రంగానికి చెందిన హీరోయిన్లు, ఇతరులు కూడా ఉన్నట్లు విమర్శలున్నాయి.
చీకోటి ప్రవీణ్ తన వెంట బ్యాంక్ స్టేట్ మెంట్లు, నోటీస్ కాపీతో పాటు న్యాయవాదితో సహా ఎంట్రీ ఇచ్చాడు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది.
ఇప్పటి వరకు చీకోటి ప్రవీణ్(Chikoti Praveen ED) ఎవరు, ఎలా ఈ దందా నడిపిస్తున్నాడు. అతడి వెనుక ఎవరెవరున్నారు. హవాలా డబ్బులు ఏమైనా చేతులు మారాయా అనే దానిపై ఆరా తీస్తోంది ఈడీ.
చీకోటి ప్రవీణ్ వాట్సాప్ కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. ఇప్పటికే చీకటి ఫోన్ , ల్యాప్ టాప్ లను సీజ్ చేశారు ఇప్పటికే. పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లు గుర్తించింది.
సినీ, రాజకీయ నేతలకు చెల్లించిన వాటిపై ఆరా తీసింది ఈడీ. ఇందులో ప్రధానంగా 10 మంది సినీ ప్రముఖులతో పాటు 20 మంది పొలిటికల్ లీడర్లు, 200 మంది కీలక కస్టమర్లు ముందుంచి ప్రశ్నించనున్నారు.
Also Read : ఢిల్లీ సీపీగా కొలువు తీరిన సంజయ్ అరోరా