Raghuram Rajan : అనాలోచిత నిర్ణయాల వల్లే కష్టాలు – రాజన్
చప్పట్లు కొట్టే వారి గురించే సర్కార్ ఆలోచిస్తుంది
Raghuram Rajan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Raghuram Rajan) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి.
చప్పట్లు కొట్టే వారి గురించే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. వృద్ది రేటు దాదాపు 7 శాతం ఉన్నా ధరల పెరుగుదలపై పార్లమెంట్ లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
దీనిపై స్పందించారు రఘురామ్ రాజన్. వృద్ది పెరిగినంత మాత్రాన ఉద్యోగాల కల్పనకు సరిపోదన్నారు. అభివృద్ధి ఉన్నప్పటికీ సామర్థ్య వినియోగం తక్కువగా ఉందని కుండ బద్దలు కొట్టారు.
రఘురామ్ రాజన్ జాతీయ మీడియాతో మాట్లాడారు. వృద్ది గణాంకాలు అనేక దేశాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ భారీ జనాభా కారణంగా ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఈ రెండు దేశానికి గుదిబండగా మారడం ప్రమాదకరమని హెచ్చరించారు రఘురామ్ రాజన్. ప్రతి ఒక్కరూ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ లేదా కన్సల్టెంట్ గా ఉండడం అన్నది ఎక్కడా ఏ దేశంలో జరగదన్నారు.
నైపుణ్యం అన్నది వివిధ స్థాయిలలో ఉంటుందన్నారు. ఏది ఏమైనా భారత ఆర్థిక వ్యవస్థ గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉందని ఓ వైపు రెండు ప్రధాన అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు మాజీ డిప్యూటీ గవర్నర్.
ప్రధానంగా ప్రజలకు సంబంధించి నైపుణ్యాలు పెరగాలి. అదే సమయంలో విద్యావకాశాలను మరింత మెరుగు పర్చాలని స్పష్టం చేశారు. దీని వల్ల ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు రఘురామ్ రాజన్.
ఎలాంటి సంప్రదింపులు లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి నోట్ల రద్దు, వ్యవసాయ బిల్లు.
Also Read : భారత్ తో బంధం బలీయమైనది