USA Warning : అల్ ఖైదాతో జ‌ర భ‌ద్రం అమెరికా అప్ర‌మ‌త్తం

అల్ జ‌వ‌హ‌రీ హ‌త్య‌తో అమెరిక‌న్లు జ‌ర జాగ్ర‌త్త‌

USA Warning : ప్ర‌పంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ గా పేరొందిన అల్ ఖైదా చీఫ్ అల్ జ‌వ‌హిరిని ఆఫ్గ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్ లో అమెరికా మ‌ట్టుబెట్టింది. దీంతో ప్ర‌తీకారం చెల‌రేగే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రించింది అగ్ర‌రాజ్యం.

ఈ మేర‌కు ఆ దేశ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అవ‌స‌ర‌మైతేనే త‌ప్ప ఇత‌ర దేశాల‌కు వెళ్ల వ‌ద్ద‌ని సూచించింది(USA Warning). దాడులు చేసే ప్ర‌మాదం ఉంద‌ని ముంద‌స్తు హెచ్చ‌రించింది.

అల్ ఖైదా అనుబంధ సంస్థ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించి ఉన్నాయ‌ని, ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం ఉందంటూ హెచ్చ‌రించింది.

ఉగ్ర‌వాద సంస్థ‌లు, ఇస్లామిక్ టెర్ర‌రిస్టు గ్రూపులు, ఉగ్ర‌వాదులు, మ‌త ఛాంద‌స‌వాదులు, హింసోన్మాదులు, సానుభూతిప‌రులు ప్ర‌స్తుతం అమెరికాకు చెందిన ఆస్తుల‌పై , పౌరులు, కార్యాల‌యాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ స్ప‌ష్టం చేసింది.

ఒక‌వేళ అమెరికా నుంచి వెళ్లే వారు ముందుగా ప్ర‌భుత్వానికి అధికారికంగా తెలియ చేయాల‌ని సూచించింది. దీని వ‌ల్ల త‌గినంత మేర భ‌ద్ర‌తా సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు వీలు క‌లుగుతుంద‌ని పేర్కొంది.

ఆత్మాహుతి దాడులు, హ‌త్య‌లు, కిడ్నాప్ లు, బాంబు పేలుళ్ల రూపంలో దాడుల‌కు దిగే చాన్స్ ఉంద‌ని మ‌రోసారి హెచ్చ‌రించింది. దీంతో దేశ వ్యాప్తంగా రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

ఇంకో వైపు అమెరికా స్పీక‌ర్ నాన్సీ పెలోసీ ప్ర‌స్తుతం తైవాన్ లో ప‌ర్య‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ప్ర‌భుత్వంతో అమెరిక‌న్లు స‌హ‌క‌రించాల‌ని కోరారు ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్.

ఇదిలా ఉండ‌గా తాలిబ‌న్లు తీవ్రంగా ఖండించారు అమెరికా చ‌ర్య‌ల్ని.

Also Read : యుద్ధం కంటే స్నేహం ముఖ్యం – నాన్సీ పెలోసీ

Leave A Reply

Your Email Id will not be published!