Gudivada Amarnath : గ్యాస్ లీకేజీపై ఏపీ సర్కార్ సీరియస్
సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలి
Gudivada Amarnath : ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది అచ్యుతాపురం సెజ్ లో ఏర్పాటైన సీడ్స్ కంపెనీలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీపై. ఈ లీకేజీ కారణంగా పలువురు ఆస్పత్రి పాలయ్యారు.
వెంటనే సీడ్స్ కంపెని మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేసేంత దాకా పరిశ్రమను మూసి ఉంచాలని ఆదేశించింది.
ఘటన తెలిసిన వెంటనే సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. వెంటనే బాధితులకు సరైన, మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు.
ఈ మేరకు విషయం తెలిసిన వెంటనే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) స్పందించారు. గతంలో చోటు చేసుకున్న ఘటనపై ఇంకా విచారణ జరుగుతోంది.
ఇదే సమయంలో మరోసారి గ్యాస్ లీకేజీ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. కాగా ఈ ఘటనలో గాయపడిన వారందరినీ ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి అమర్ నాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆస్పత్రి వర్గాలను. ఇప్పటి వరకు సీడ్స్ కంపెనీలో 121 మంది అస్వస్థతకు గురైనట్లు మంత్రి వెల్లడించారు.
బాధితులను ఐదు ఆస్పత్రులలో చేర్పించామని చెప్పారు. బాధితులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. చికిత్సకు సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు గుడివాడ అమర్ నాథ్.
కాంప్లెస్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు.
Also Read : అల్ ఖైదాతో జర భద్రం అమెరికా అప్రమత్తం