Sri Lanka President : భారత్ సాయానికి రుణపడి ఉన్నాం
శ్రీలంక అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్
Sri Lanka President : శ్రీలంక దేశ అధ్యక్షుడు రణిలె విక్రమసింఘే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్థిక, ఆహార, విద్యుత్, గ్యాస్ సంక్షోభంతో కొన ఊపిరితో ఉన్న శ్రీలంక దేశానికి ప్రాణం పోసింది మాత్రం భారత దేశం మాత్రమేనని ప్రశంసలతో ముంచెత్తారు.
పార్లమెంట్ సమావేశంలో బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రణిలె. 1948 లో శ్రీలంకకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతటి తీవ్రమైన, భయానకమైన పరిస్థితులు ఎప్పుడూ తలెత్త లేదన్నారు ప్రెసిడెంట్.
యావత్ ప్రపంచం శ్రీలంక వీటిని అధిగమిస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూశారని కానీ మానవతా దృక్ఫథంతో ఒకే ఒక్క దేశం భారత దేశం తమను ఆదుకుందని చెప్పారు.
ఈ సందర్భంగా దేశానికి చెందిన లంకేయులు రుణపడి ఉంటామన్నారు రణిలె విక్రమసింఘే. అంపశయ్యపై ఉన్న లంకకు ఊపిరి పోసింది మాత్రం ఇండియా అంటూ కితాబు ఇచ్చారు.
ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏడు రోజుల వాయిదా అనంతరం బుధవారం తిరిగి సమావేశమైంది పార్లమెంట్. కీలక సమావేశాన్ని ఉద్దేశించి దేశ అధ్యక్షుడు(Sri Lanka President) విక్రమ సింఘే ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం శ్రీలంక చీఫ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఓ వైపు చైనా తమకు రుణాలు ఇచ్చి తలవంచుకునేలా చేస్తే భారత దేశం మాత్రం ఆపదలో ఆదుకుని ఆపన్న హస్తం అందించిందని కొనియాడారు రణిలె విక్రమసింఘే.
ఇదిలా ఉండగా గత వారం ప్రధాన మంత్రి మోదీ విక్రమసింఘేను అభినందించారు. స్థిరత్వం , ఆర్థిక పునరుద్దరణ కోసం ద్వీప దేశం నిలబడేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని ప్రకటించారు. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.
Also Read : మంత్రి ఫైర్ చన్నీ కోడలు రిజైన్