Police Forces : సోనియా ఇంటి ముందు పోలీసుల మోహరింపు
నేషనల్ హెరాల్డ్ కేసులో కోలుకోలేని బిగ్ షాక్
Police Forces : నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారించింది.
రాహుల్ ను 5 రోజుల పాటు 60 గంటల సేపు ప్రశ్నించింది. ఇక సోనియాను మూడు రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ పత్రిను నిర్వహిస్తున్న యంగ్ ఇండియన్ ఆఫీసును సీల్ చేసింది.
తమ అనుమతి లేకుండా తెరిచేందుకు వీలు లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసు లో పేర్కొంది. కాగా కేసుకు సంబంధించి సోదాలు నిర్వహించేందుకు ముందస్తు సమాచారం ఇచ్చినా ఎవరూ అందుబాటులో లేక పోవడంతో ఆ కార్యాలయానికి తాత్కాలికంగా సీల్ వేసినట్లు స్పష్టం చేసింది.
ముందు జాగ్రత్త చర్యగా ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ నివాసం ముందు పోలీసులను(Police Forces) భారీగా మోహరించింది. ఇదిలా ఉండగా ప్రిన్సిపల్ ఆఫీసర్ , పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను ముగించేంందుకు పిలిపించారు.
ఇక సోనియా గాంధీ నివాసం ఉంటున్న 10 జన్ పథ్ రోడ్డు వెలుపల అదనపు పోలీస్ సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పార్టీ కార్యాలయం వెలుపల కూడా ఖాకీలు మోహరించారు.
మరో వైపు యంగ్ ఇండియన్ ఆఫీసుకు తాళం వేయడంతో ఖంగుతిన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్ , మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సాల్ , పి. చిదంబరం సమావేశమయ్యారు.
మమ్మల్ని అణిచి వేసేందుకు కుట్రలో భాగంగా పోలీసుల మోహరింపు అన్నారు జైరాం రమేష్.
Also Read : మోదీ వ్యూహం సోనియా..రాహుల్ ఇరకాటం