China Taiwan : చైనా దూకుడుపై తైవాన్ క‌న్నెర్ర‌

తైవాన్ వ‌ద్ద సైనిక విన్యాసాలు స్టార్ట్

China Taiwan : ప్ర‌స్తుతానికి ప్ర‌శాంతంగా ఉన్న తైవాన్ తేనె తుట్టెను క‌దిలించింది పెద్ద‌న్న అమెరికా. ఓ వైపు చైనా ఈ భూభాగాన్ని త‌మ‌దేనంటోంది. తైవాన్ పై కాలు మోపితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

అమెరికా స్పీక‌ర్ నాన్సీ పెలోసీ డ్రాగ‌న్ హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌ర్ చేస్తూ తైవాన్ ను సంద‌ర్శించింది. ఆమె సంద‌ర్శించి 24 గంట‌లు పూర్త‌యిన వెంట‌నే సైనిక విన్యాసాల‌కు శ్రీ‌కారం చుట్టుంది.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది తైవాన్ తో పాటు అమెరికా. ఇదిలా ఉండ‌గా తాము యుద్దం చేయ‌డానికి రాలేద‌ని తైవాన్ తో స్నేహం చేసేందుకు వ‌చ్చామ‌ని స్ప‌ష్టం చేశారు నాన్సీ పెలోసీ.

చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికాకు. అవ‌స‌ర‌మైతే యుద్దానికి సై అన్నారు. మ‌రో వైపు ఉక్రెయిన్ పై ర‌ష్యా ఇంకా యుద్దాన్ని కొన‌సాగిస్తూనే ఉన్న‌ది.

ఈ త‌రుణంలో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొనేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌ని వెంట‌నే చైనా మానుకోవాల‌ని ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు సూచించాయి.

తైవాన్ సైతం చైనాతో(China Taiwan) యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. అయితే అమెరికా చైనాకు అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఆ దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్,

స్పీక‌ర్ పెలోసీ. ఇదిలా ఉండ‌గా తైవాన్లు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు చైనా నిర్వాకంపై. మ‌న దేశాన్ని ర‌క్షించు కునేందుకు పోరాడాల‌ని పిలుపునిస్తున్నారు.

చైనా తైవాన్ పై ఆంక్ష‌లు విధించ‌డం ప్రారంభించింది. వెంట‌నే ఉప‌సంహ‌రించు కోవాల‌ని కోరుతున్నారు.

Also Read : చైనా క‌న్నెర్ర తైవాన్ పై సైనిక ప‌హ‌రా

Leave A Reply

Your Email Id will not be published!