Justice UU Lalit : సీజేఐ రేసులో జస్టిస్ యుయు లలిత్
సిఫారసు చేసిన సీజేఐ ఎన్వీ రమణ
Justice UU Lalit : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ పదవీ కాలం ఈనెలలోనే పూర్తి కాబోతోంది. దీంతో తదుపరి సీజేఐగా ఎవరు ఉండ బోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం నిర్వహించింది. ఈ కీటక భేటీ గతంలో ఎన్నడూ లేని రీతిలో 75 నిమిషాలకు పైగా సాగింది. కానీ సీజేఐ, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జీల ఎంపిక విషయంలో ఒక అవగాహనకు రాలేక పోయారు.
అయితే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయ శాఖ సీజేఐ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ యుయు లలిత్ ను ప్రధాన న్యాయమూర్తిగా చేయాలని సిఫారసు చేసింది.
ఆయన కేవలం పట్టుమని 74 రోజుల పాటే సీజేఐగా ఉంటారు. ఆ తర్వాత పదవీ విరమణ చేస్తారు. ఇదిలా ఉండగా భారత దేశ న్యాయ వ్యవస్థలో తెలుగు వాడైన నూతల పాటి వెంకట రమణ దేశ వ్యాప్తంగా తన తీర్పులు, వ్యాఖ్యలతో, సూచనలు, అభిప్రాయాలతో చరిత్ర సృష్టించారు.
ఆయన స్వతంత్ర భారత దేశానికి 48వ సీజేఐ. కాగా ఆయన తర్వాత కొలువు తీరబోయే యుయు జస్టిస్ లిలిత్(Justice UU Lalit) 49వ వ్యక్తిగా ఉండనున్నారు.
స్వల్ప కాలమే అయినా ఆయనను సీజేఐగా అవకాశం ఇచ్చి గౌరవంగా సాగనంపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రస్తుత జస్టిస్ రమణ, జస్టిస్ చంద్రచూడ్ భావించారు.
ఇక లలిత్ తర్వాత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్ర చూడ్ ఈ దేశానికి కొలువు తీరనున్నారు.
Also Read : జాతీయ పతాకమా వర్ధిల్లవమ్మా