CM KCR : హైదరాబాద్ లో నిఘా నేత్రం ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు
CM KCR : దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐపీసీసీసీ) ను ప్రారంభించారు సీఎం కేసీఆర్(CM KCR). ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకునేలా దీనిని తీర్చిదిద్దారు. ఒకే చోటు నుంచి నగరమంతా చూసేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న వాటితో అనుసంధానం చేశారు. రూ. 600 కోట్లతో 18 అంతస్తులతో దీనిని రూపొందించారు. దీని విస్తీర్ణం 7 ఎకరాలు , 6.42 లక్షల చదరపు అడుగులు. 83.5 ఎత్తులో ఉంది ఈ భవనం.
18వ ఫ్లోర్ లో హైదరాబాద్ కు చెందిన సిటీ ఆఫీసు కొలువు తీరి ఉంది. 14, 15 ఫ్లోర్ లలో మ్యూజియం , గ్యాలరీ ని ఏర్పాటు చేశారు. 7వ ఫ్లోర్ లో సీఎం, ప్రధాన కార్యదర్శి (సీఎస్ ) , డీజీపీ సహా కీలక విభాగాలకు చెందిన చీఫ్ లకు చాంబర్లు కేటాయించారు.
ఇక బి – వింగ్ ను టెక్నాలజీ విభాగానికి కేటాయించారు. రాష్ట్రంలోని పోలీస్ విభాగంలోని అన్ని సీసీ కెమెరాలను దీనికి అనుసంధానం చేశారు. ఇక భాగ్యనగరం అంతా పోలీస్ కమాండ్ కంట్రోల్ లో ఉంటుంది.
ఎక్కడ ఏం జరిగినా ఇందులో రికార్డ్ నమోదు అవుతుంది. నగర పరిధిలోని అన్ని శాఖలను దీని కిందకు తీసుకు వచ్చారు. ఇందులో విశేషం ఏమిటంటే ఒకేసారి లక్ష సీసీ టీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలను ఏర్పాటు చేశారు.
ప్రతి దానిని దీనితో అనుసంధానం చేశారు. దీని వల్ల పారదర్శకత అనేది ఏర్పడుతుంది. ఎక్కడో ఉన్న మారుమూల పల్లె గురించి దీని ద్వారా చూడవచ్చు.
Also Read : 5జీ సేవలకు ఎయిర్ టెల్ రెడీ