Congress March : రేపే కాంగ్రెస్ చ‌లో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్

పార్టీ ఆధ్వ‌ర్యంలో ఎంపీల ర్యాలీ

Congress March : మోదీ స‌ర్కార్ నిత్యాస‌రాల ధ‌ర‌ల‌ను పెంచ‌డాన్ని నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 5న శుక్ర‌వారం పెద్ద ఎత్తున మార్చ్ నిర్వ‌హించ‌నుంది(Congress March) . ఈ మేర‌కు ఎంపీలు ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు మార్చ్ చేప‌ట్టనున్నారు.

ఈ విష‌యాన్ని ఇటీవ‌లే పార్టీ వెల్ల‌డించింది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై పెను భారం మోపింద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేసిందంటూ ఆరోపించింది.

ప్ర‌జాస్వామ్యానికి భంగం క‌లిగించేలా, ప్ర‌భుత్వ రంగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ఈ ప్ర‌భుత్వానిదేనంటూ మండిప‌డింది. నిత్య‌వసరాల‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని గ్యాస్ ధ‌ర కొండెక్కింద‌ని మండిప‌డ్డారు కాంగ్రెస్ ఎంపీలు.

పార్ల‌మెంట్ నుంచి రాష్ట్ర‌పతి భ‌వ‌న్ వ‌ర‌కు ఈ మార్చ్ కొన‌సాగ‌నుంది. ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఆరోపించారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింద‌ని మండిప‌డ్డారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బిజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు, పార్టీలు, వ్య‌క్తులు, నాయ‌కులు, సంస్థ‌లు , కంపెనీల‌పై దాడుల‌కు ఉసి గొల్పుతున్నారంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా గురువారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ షాపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.

ఎన్ని దాడుల‌కు పాల్ప‌డినా లేదా అక్ర‌మ కేసులు బ‌నాయించినా లేదా అరెస్ట్ లు చేసినా భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ప్ర‌జల కోసం ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌న్నారు.

ఇక రేప‌టి మార్చ్ తో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. సోనియా సార‌థ్యంలో చ‌లో కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

Also Read : హుజారాబాద్ రిజ‌ల్ట్ మునుగోడులో రిపీట్

Leave A Reply

Your Email Id will not be published!