Sanjay Raut : కిటికీలు లేని గదిలో ఉంచారు – సంజయ్ రౌత్
వసతులు కలిగిన గదిలో ఉంచాలని ఆదేశం
Sanjay Raut : మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి విచారణను ఎదుర్కొంటున్నారు శివసేన అగ్ర నేత, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut). ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పర్చగా కస్టడీకి తరలించారు.
గురువారం ప్రత్యేక కోర్టు ముందు ఎంపీని హాజరు పర్చింది ఈడీ. ఈ సందర్భంగా సంజయ్ రౌత్ ను ఉద్దేశించి కోర్టు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని అడిగింది.
దీంతో ఎంపీ ఈడీ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు విచారణ సందర్భంగా ఎలాంటి కిటికీలు లేని గదిలో ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో కోర్టు సీరియస్ గా స్పందించిందుకు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ ప్రశ్నించింది. వెంటనే వసతులతో కూడిన గదిని సంజయ్ రౌత్ కు కేటాయించాలని ఆదేశించింది.
విచారణలో భాగంగా ఎంపీని సోమవారం వరకు ఈడీ కస్టడీకి పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. కాగా దర్యాప్తు చేస్తున్న సంస్థ ఈడీ తరపున న్యాయవాది దీనిని ఖండించారు.
ఆయనకు సౌకర్యవంతమైన గదిని కేటాయించారని తెలిపారు. ఆయన ఎయిర్ కండీషన్డ్ గదిలోనే ఉన్నారని తెలిపారు. కాగా చికిత్స బాగానే చేశారని కానీ గదిని మాత్రం కేటాయించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఆరోపించారు రౌత్.
ఇదిలా ఉండగా చాల్ ను తిరిగి అభివృద్ధి చేయడంలో ఆర్థిక అవకతకలకు సంబంధించిన కేసులో ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
ఇదిలా ఉండగా సంజయ్ రౌత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈడీ. ఇవాళ ఆయన భార్య వర్షా రౌత్ కు సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది.
Also Read : సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు