Priyanka Gandhi : ప్రియాంక గాంధీ వాద్రా అరెస్ట్

బారికేడ్ల‌ను దాటుకుని బైఠాయింపు

Priyanka Gandhi : ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, నిత్యావ‌స‌ర వ‌స్తువ‌ల‌పై జీఎస్టీ పెంచ‌డాన్ని నిర‌సిస్తూ శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీ పోరు బాట ప‌ట్టింది. ప్ర‌ధాన మంత్రి ముట్టడికి పిలుపునిచ్చింది.

ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, శ్రేణులు పెద్ద ఎత్తున దేశ రాజ‌ధాని ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు.

సంద‌ర్బంగా ప్ర‌జా ప్ర‌తినిధులంతా న‌ల్ల దుస్తులు ధ‌రించి వినూత్న నిర‌స‌న తెలిపారు. పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు నిర‌స‌న‌గా వెళుతుండ‌గా కాంగ్రెస్ పార్టీ కార్యాయం వ‌ద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌ను అడ్డుకున్నారు పోలీసులు.

వెళ్ల‌కుండా ఏర్పాటు చేసిన బారికేడ్ల‌ను దాటుకుని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆమెను చుట్టు ముట్ట‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రోడ్డు పైనే బైఠాయించారు. ప్రియాంకా గాంధీ వాద్రా నిర్బంధాన్ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది ఉందా అంటూ ప్ర‌శ్నించారు.

రాచ‌రిక పాల‌న సాగిస్తున్నార‌ని ధ్మ‌జమెత్తారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం నేరం ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు ప్రియాంక గాంధీ వాద్రా. తాను ఎక్క‌డికి వెళ్లేది లేదంటూ మార్గ మ‌ధ్యంలోనే బైఠాయించారు.

దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, త‌దిత‌ర సీనియ‌ర్ నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్ ను పార్టీ తీవ్రంగా ఖండించింది.

కాంగ్రెస్ నేత‌ల అరెస్ట్ పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌న్నారు జైరాం ర‌మేష్.

Also Read : ప్ర‌జాస్వామ్యానికి స‌మాధి రాచ‌రికానికి పునాది

Leave A Reply

Your Email Id will not be published!