Uddhav Thackeray : సామ్నా ఎడిటర్ గా ఉద్ధవ్ ఠాక్రే
2019లో సీఎం అయ్యేంత వరకు
Uddhav Thackeray : శివసేన పార్టీకి గొంతుకగా ఉంటూ వస్తోంది సామ్నా వార్తా ప్రతిక. ఈ సామ్నా 1989లో ప్రారంభమైంది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు చని పోయేంత వరకు బాలా సాహెబ్ ఠాక్రే సంపాదకుడి (ఎడిటర్ ) గా ఉన్నారు.
ఆయన మరణాంతరం తనయుడు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో 2019లో ఆయన ఎడిటర్ నుంచి తప్పుకున్నారు. శివసేన,, కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్తంగా మహా వికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఉద్దవ్ ఠాక్రే సీఎంగా కొనసాగారు. ఈ ఏడాది జూలై లో అనూహ్యంగా శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. దీంతో ఉద్దవ్ ఠాక్రే అనూహ్యంగా తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ సమయమంలో ఏక్ నాథ్ షిండే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరారు.
అప్పటి వరకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరించారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయనను కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది.
ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ తరుణంలో తాను నిర్వహించిన ఎడిటర్ స్థానంలోకి తిరిగి వచ్చారు ఉద్దవ్ ఠాక్రే.
శుక్రవారం వార్తా పత్రిక ప్రింట్ లైన్ లో ఉద్దవ్ ఠాక్రే పేరు సంపాదకుడిగా , సంజయ్ రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. 2012లో బాల్ ఠాక్రే మరణించడంతో ఉద్దవ్ ఠాక్రే ఎడిటర్ గా కొలువు తీరారు. 2019లో వైదొలిగాక తన భార్య రష్మీని నియమించారు.
Also Read : సుప్రీంకోర్టులో 71 వేల కేసులు పెండింగ్