Dasoju Sravan : కులం..ధనం రేవంత్ రాజకీయం
నిప్పులు చెరిగిన దాసోజు శ్రవణ్
Dasoju Sravan : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్(Dasoju Sravan) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. గత కొన్నేళ్లుగా శ్రవణ్ తెలంగాణ వాయిస్ ను వినిపిస్తూ వస్తున్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అక్రమాలను ఎండగడుతూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నిస్తేజంలో ఉన్న సమయంలో ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు చాన్స్ ఇచ్చిన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పీసీసీ పార్టీలాగా నడవడం లేదన్నారు.
కులం..ధనం రేవంత్ రెడ్డి రాజకీయంగా మారిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ పార్టీని ఒక మాఫియా లాగా మార్చేశాడంటూ ధ్వజమెత్తారు.
కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని మండిపడ్డారు. ఒక రకంగా పార్టీని ఏజెన్సీలాగా మార్చేశాడని తాను చెప్పిందే పార్టీ అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడని సీరియస్ కామెంట్స్ చేశారు.
ప్రతి నియోజకవర్గంలో పార్టీని నాశనం చేశాడని, ఒక్క టికెట్ కోసం పది మంది పోటీ పడేలా చేశాడని సీరియస్ అయ్యారు. ప్రతి చోటా తనకంటూ ఓ ముఠా తయారు చేసుకున్నాడని చెప్పారు.
ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఓ ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్ మెంట్ లా మార్చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
తిరుపతిలో ఎల్ 1 దర్శనాలు తీసేశారు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఎల్1, ఎల్ 2 దర్శనాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
Also Read : రేవంత్ వద్ద ఎల్ 1, ఎల్ 2 దర్శనాలు