Dasoju Sravan : రేవంత్ వద్ద ఎల్ 1, ఎల్ 2 దర్శనాలు
ఇదేమి రాజకీయం రా నాయనా
Dasoju Sravan : దాసోజు శ్రవణ్ ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. కానీ ఉన్నట్టుండి ఇవాల్టి వరకు వాయిస్ ఆఫ్ తెలంగాణగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని కీలక పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అగ్ర కుల దురహంకారానికి ప్రయారిటీ ఇస్తూ బహజనులను బానిసలుగా చూస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడ వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఏమీ ఉండదన్నారు.
తాను గతంలో కేసీఆర్ ను ఎండగట్టానని ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. ఇంత కాలం తాను వారి గొంతుకనై వచ్చానని చెప్పారు.
తిరుమలలో గతంలో ఎల్ 1, ఎల్ 2 దర్శనాలు రద్దు చేశారని కానీ రేవంత్ రెడ్డి వద్ద ఆ ఎల్1, ఎల్ 2 దర్శనాలు ప్రారంభం అయ్యాయని, ఎవరికీ దొరకడని ధ్వజమెత్తారు.
ఆయన పార్టీని ఓ ఫ్రాంచైజీలుగా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు లేదా నలుగురిని ప్రోత్సహిస్తూ సొంత ముఠా తయారు చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
కులం, ధనంతో పార్టీని నడిపిస్తున్నాడని ఒక రకంగా ఇది అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). తెలంగాణలో అగ్రకుల దురహంకారానికి ప్రతీకంగా టీపీసీసీ మారిందని మండిపడ్డారు.
సగటు కాంగ్రెస్ కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లారంటూ మండిపడ్డారు. స్వార్థ పూరిత రాజకీయాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు పార్టీకి దూరం అవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై