Mamata Banerjee Modi : ప్రధాని మోదీతో సీఎం దీదీ భేటీ
ప్లీజ్ బకాయిలు విడుదల చేయండి
Mamata Banerjee Modi : బెంగాల్ లో ఈడీ దాడుల తర్వాత సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తో భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు ప్రధానిని దీదీ(Mamata Banerjee). ఇదిలా ఉండగా ఈడీ దాడుల తర్వాత వీరిద్దరూ కలవడం కలకలం రేపింది.
శనివారం ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ సమయంలో మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది మమతా బెనర్జీ.
ఇదే సమయంలో ప్రతిపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా బరిలో నిలిచారు. ఈ సమయంలోనే కేంద్రంపై నిప్పులు చెరుగుతూ వచ్చిన దీదీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రం.
ఈ మేరకు ఆమెకు అనుంగు అనుచరుడిగా పేరొందిన మంత్రి పార్థ ఛటర్జీతో పాటు ఆయన సన్నిహితురాలిగా పేరొందిన సినీ నటి అర్పితా ముఖర్జీపై దాడులు చేసింది.
ఊహించని రీతిలో దేశం విస్తు పోయేలా ఏకంగా అర్పిత ఇళ్లల్లో రూ. 50 కోట్ల నగదు పట్టుబడింది. నోట్ల కట్టలతో పాటు 5 కేజీల బంగారం కూడా స్వాధీనం చేసుకుంది ఈడీ. దీంతో ఖంగుతిన్న మమతా బెనర్జీ పార్థ చటర్జీని తొలగించింది.
ఇదే సమయంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. మంత్రి, అర్పితకు చెందిన శాంతి నికేతన్ ఫామ్ హౌస్ పై దాడి చేసింది. ఈ తరుణంలో మమతా బెనర్జీ ప్రధాన మంత్రి మోదీని కలవడం ప్రతిపక్షాలను పునరాలోచనలో పడేసింది.
కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన రూ. 17,996 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ ఇచ్చింది దీదీ. మొత్తం పథకాలకు సంబంధించి రూ. 1,00,968. 44 కోట్లు రావాల్సి ఉందని కోరింది.
Also Read : కోట్లు కొల్లగొట్టారు జల్సా చేస్తున్నారు